మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ నాయక పు గూడెం లో మద్ది రాంచందర్ 22వ వర్ధంతి

 దేవాపూర్ నాయకపు గూడెం

లో ఘనంగా గిరిజన నేత

మద్ది రాంచందర్ 22వ

వర్ధంతి.






Scv News Kasipet:--

 కాసిపేట మండలం  దేవాపూర్ పంచాయతీ పరిధిలో గల నాయక పు గూడలో ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం వ్యవస్థాపకులు అమరుడు మద్ది రామచందర్ 22వ వర్ధంతి ని మంగళవారం మండల నాయకుడు సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించచారు. ఈ సందర్భంగా   నాయక్ పోడ్ సేవా సంఘం  రాష్ట్ర కోశాధికారి కొమ్ముల  బాపు మాట్లాడుతు ఉమ్మడి  రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉన్న నాయక్ పోడ్ తెగ గిరిజనులను సమీకరించి వారి హక్కుల సాధన కోసం నాయక్ ఫుల్ సేవా సంఘాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు అని అన్నారు. గిరిజన చట్టాలను తుంగలో తొక్కి గిరిజనేతరులు గిరిజనుల  భూములను ఆక్రమించుకుంటే అడ్డుకున్న  నాయకుడు మద్ది రామచందర్ అని కొనియాడారు. గిరిజన చట్టాలకు విరుద్ధంగా  మందమరి  ఏజెన్సీ ప్రాంతం లో మునిసిపల్ ఎన్నికలు  హైకోర్టుకు వెళ్లి నిలిపివేశాడు అన్నారు. ఆదివాసీ విద్య కోసం తన ఇంటిని హాస్టల్ గా మార్చి సొంత ఖర్చులతో  ఆదివాసీలకు విద్యను అందించిన మానవతామూర్తి మద్ది రామచందర్ అని కొనియాడారు. సింగరేణి ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూ రెండు పర్యాయాలు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని నాయక్ పోడ్ తెగ అభివృద్ధి కోసం  జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన రామ్ చందర్ ను ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలని అన్నారు. తదనంతరం   మద్ది రాంచందర్ జీవిత విశేషాలపై కొమ్ముల బాపు పాట పాడారు.

కార్యక్రమానికి ముందుగా మద్ది రామ్ చందర్   చిత్రపటానికి నాయక్ పోడ్ సేవా సంఘం నాయకులు  పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  కాసిపేట మండల అధ్యక్షులు బద్ది శ్రీనివాస్ సంఘం జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రోడ్డ రవీందర్ మండల కోశాధికారి, భీమిని మహేందర్ మండల ఉపాధ్యక్షులు, రెడ్డి లక్ష్మణ్ మండల సంస్కృతిగా కార్యదర్శి, బద్రి శ్రీనివాస్ మద్ది మడ గ్రామ కమిటీ అధ్యక్షులు,కొమ్ముల రజిత మహిళా కార్యదర్శి,రోడ్డ పో సక్క కొమ్ముల సంజీవ్ మేకల సునీల్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.