మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కేకే ఓసి దుబ్బగూడెం వాసులు పునరావాస స్థలాన్ని సందర్శన.

 కేకే ఓసి ముంపు

దుబ్బగూడెం వాసులు

పునరావాస స్థలాన్ని

సందర్శన.


Scv News Kasipet :--

 మందమర్రి ఏరియా కేకే ఓపెన్ కాస్టు ముంపు బాధిత గ్రామం దుబ్బగూడెం గ్రామ ప్రజలు మంగళవారం   R&R సెంటర్ స్థలము సందర్శించడం జరిగింది. ముంపు బాధిత గ్రామమైన దుబ్బగూడెం పునరావాసం కోసం పెద్దనపల్లి  గ్రామ శివారులోసింగరేణి యాజమాన్యం 32 ఎకరాలను కొనుగోలు చేసి300 కుటుంబాలకు  ఫ్లాట్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో భూమిని చదును చేయడం జరిగింది. చదును చేసిన స్థలాన్ని దుబ్బగూడెం గ్రామస్తులు కుటుంబ సభ్యులతో సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా దుబ్బ గూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్ మాట్లాడుతూ  త్వరగా సింగరేణి రెవిన్యూ వారు దుబ్బగూడెం గ్రామానికి కేటాయించిన స్థలం లొ అభివృద్ధి పనులు నిర్వహించి ప్లాట్స్ కేటాయించాలని కోరారు.వర్షాకాలం సమీపిస్తున్నది కాబట్టి త్వరగా పునరావాసం కలిపించి నష్ట పరిహారం త్వరగా చెలించ వలిసిందిగా డిమాండ్ చేశారు.18 సంవత్సరాలు  దాటినా యువతీ యువకులను త్వరగా గుర్తుంచి వారికీ కూడా త్వరగా పరిహారం చెల్లించ వలసిందిగా కోరారు.SES సెర్వె లో మిస్ అయినా లబ్ది దారులను త్వరగా గుర్తుంచి న్యాయం చేయవలసిందిగా రెవెన్యూ అధికారులను, సింగరేణి యాజమాన్యాని కోరారు.