కస్తూరిబా పదవ తరగతి
విద్యార్థులకు ఉజ్వల్ క్రెడిట్
కోపరేటివ్ సొసైటీ పరీక్ష
ప్యాడ్లు అందజేత.
Scv News Kasipet :--
కాసిపేట మండలం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం మంచిర్యాల పట్టణానికి చెందిన ఉజ్వల క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ వారు పరీక్ష ప్యాడ్లు పెన్నులు అందజేశారు . ఈ సందర్భంగా ఉజ్వల కోపరేటివ్ సొసైటీ చైర్మన్ కర్ణ శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని క్రమశిక్షణతో ఒత్తిడి భయాలు లేకుండా చదివితే ఉన్నత స్థానాలకు వెళ్తారని అన్నారు. సీఈఓ లక్ష్మణ్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో బాలికలకు కేజీబీవీ పాఠశాలలో వరం లాంటివి అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలు లేని విద్యార్థులకు ఈ పాఠశాలల్లో చదువుకుంటే ఉన్నత స్థాయిలో కి వెళ్ళవచ్చు అన్నారు. భవిష్యత్తులో పాఠశాలలో చదివే విద్యార్థులకు తమ వంతు సహాయ, సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ అర్జున్ మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు భయం పోగొట్టుకోవడానికి పాజిటివ్ దృక్పథం అలవర్చుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించ వచ్చని అన్నారు . భవిష్యత్లో ఏదైనా సాధించాలన్న విద్యార్థి దశ పునాది లాంటిదని ఉన్నత లక్ష్యం పెట్టుకుని చదువుతే విజయవంతం అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉజ్వల క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ రీజినల్ మేనేజర్ సతీష్, విద్యావేత్త శాంతా పూరి జనార్ధన్, బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్, కేజీబీవీ ప్రత్యేక అధికారి సరిత తదితరులు పాల్గొన్నారు.

