మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బదిలీపై వెళ్తున్న ఎస్టేట్ అధికారిణి నవనీత కు దుబ్బగూడెం వాసుల సన్మానం.

 బదిలీపై వెళ్తున్న ఎస్టేట్

అధికారిణి నవనీత కు

దుబ్బగూడెం వాసుల

సన్మానం.




Scv News Kasipet :--

 మందమర్రి ఏరియా ఎస్టేట్ అధికారిణి గా పనిచేసిన నవనీత గోలేటి డివిజన్ కు బదిలీ పై వెళుతున్న సందర్భంగా కాసిపేట మండలం దుబ్బ గూడెం గ్రామ కమిటీ సోమవారం ఘనంగా సన్మానించింది. కేకే ఉపరితల గని లో ముంపుకు గురవుతున్న దుబ్బగూడెం గ్రామస్తులకు పునరావాసం కోసం స్థలాన్ని కేటాయించడం, సక్రమంగా నష్ట పరిహారం వచ్చేలా కృషి చేసినందుకు కృతజ్ఞతగా దుబ్బ గూడెం గ్రామ కమిటీ ఎస్టేట్ అధికారిని నవనీత ను మందమరి జిఎం కార్యాలయంలో శాలువాతో సన్మానించి మెమొంటో అందజేశారు.

 నవనీత ను సన్మానించిన వారిలో గ్రామ కమిటీ అధ్యక్షులు గోనెల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు ముత్యాల మల్లేష్, ఆర్ అండ్ ఆర్ కమిటీ సభ్యులు దుర్గం శ్రీనివాస్, బూరుగ పల్లి రమేష్,కరుణాకర్, నాగపురి శ్రీనివాస్, సతీష్ లు ఉన్నారు.