మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ముత్యం పల్లి గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం.

 ముత్యం పల్లి గ్రామంలో

ఉచిత దంత వైద్య శిబిరం.


Scv News Kasipet:--

కాసిపేట మండలం ముత్యంపల్లి  గ్రామంలో మండల వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ రావు నివాసంలో  మంగళవారం  మంచిర్యాల పట్టణానికి చెందిన నాగార్జున వైష్ణవి దంత ఆసుపత్రి యాజ మాన్యం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఆడే బాదు, విక్రమ్ రావు ప్రారంభించారు. వైద్య శిబిరానికి పరిసర గ్రామాల ప్రజలు హాజరై వైద్య చికిత్సలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమం పెద్దనపల్లి mptc కొండ బత్తుల రామచందర్, ముత్యం పల్లి ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, చిన్న ధర్మారం ఉపసర్పంచ్ పానుగంటి అశోక్, మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, కాసిపేట, ముత్యం పల్లి చిన్న ధర్మారం గ్రామ కమిటీ అధ్యక్షులు అగ్గి సత్తయ్య మద్ది వేణు, మెరుగు శ్రీనివాస్, బలరాం దంత ఆస్పత్రి వైద్యులు నాగార్జున, వైష్ణవి,శిల్పా రావు లు పాల్గొన్నారు.