దేవాపూర్ లో సీఐటీయూ
ఆధ్వర్యంలో ఘనంగా మే డే
ఉత్సవాలు!
Scv News Kasipet :--
కాసిపేట మండలంలోని దేవాపూర్ మేజర్ పంచాయతీ లో సిఐటియు ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గొడిసెల అనిల్ గ్రామ పంచాయితి యూనియన్ నాయకులు ఎర్ర జెండాఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గొడిశాల చంద్రమౌళి మాట్లాడుతూ ప్రపంచంలో వెట్టి చాకిరి. బానిస బ్రతుకులు పోవాలని ఎనిమిది గంటల పని దినాల కోసం ఆనాడు చికాగో నగరంలో పోరాడి అమరులైన వీరులు సాధించిన మేడే స్ఫూర్తితో కార్మికులు,కర్షకుల ఐక్యత పోరాటం లోకి రావాలని పిలుపు నిచ్చారు. దేశంలో రాష్ట్రంలో, పాలిస్తున్న పాలకులు. కార్మికులు. సాధించుకున్న హక్కులను. కాలరాస్తున్నాయని. దేశంలోని సంపాదను.బడా పెట్టుబడిదారుల కు అమ్మేస్తూ ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని ప్రైవేట్ పరం చేస్తూ రిజర్వేషన్లను ఎత్తివేస్తూ న్నారన్నారు..నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తూ అసమానతలను పెంచుతూ మతోన్మాదాన్ని రగిలిస్తూ పాలన కొనసాగిస్తున్నాయన్నారు. కాబట్టి దేశంలోని, ప్రజలు, కార్మికులు, కర్షకులు మేడే స్ఫూర్తితో ఈ పాలకుల పైన తిరుగుబాటు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయుకులు కుర్సింగ నగేష్,కార్మిక నాయకులు మెరుగుశంకర్,రాజం,ల్లయ్య,నర్సమ్మ,మల్లేష్,కవ లింగు,సండ్రా భీమయ్య, రామకృష్ణ కార్మికులు పాల్గొన్నారు.

