కాసిపేట కోదండ
రామాలయంలో
అష్టావధానంలో
కళాకారులకు సన్మానం.
కాసిపేట మండలం కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయ శివాలయ దివ్యక్షేత్రంలో గురువారం సాయంత్రం పదవ తరగతి పూర్వ విద్యార్ధుల బృందము(1984-85) కాసిపేట వారి ఆధ్వర్యంలో అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు.
శతావధాన షడానన శ్రీ మారేపల్లి వెంకట రమణ పట్వర్ధన్ అష్టావధానం చేశారు. పృచ్ఛకులు గా మల్లప్ప వసంత శర్మ, దండనాయకులు వామన్ రావు , గొల్లపల్లి మహేందర్, రాంపల్లి పద్మజా, పోటు హైమావతి, కోటి చింతల సురేష్ కుమార్, దుర్గం రాజేష్ గౌడ్ పాల్గొన్నారు.
స్థానిక కళాకారులకు సన్మానం
అష్టావధాన కార్యక్రమం అనంతరం స్థానిక కవి రచయిత కళాకారులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. సన్మానించిన వారిలో కవి రచయిత గోడిసెల బాపు,గాయకుడు రాజా తిరుపతి లను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమం లో అష్టావధాన కార్యక్రమంలో పాల్గొన్న కవులు రచయితల తో పాటు పూర్వ విద్యార్థులు గొల్లపల్లి సత్యనారాయణ, అంకం రాయమల్లు, రాపర్తి శ్రీను, దాసరి రామ్ చందర్, దుర్గం రాజలింగు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

