కాసిపేట ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ
చేసిన ఎమ్మెల్యే దుర్గం
చిన్నయ్య.
Scv News Kasipet :-l
కాసిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని గదులను పరిశీలించారు. ఆసుపత్రి వైద్యాధికారి శ్రీదేవితో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు చికిత్సలు సరిగా చేస్తున్నారని అడిగారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం, ఆశావర్కర్ల తో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో సహజ ప్రసవాలు అయ్యేలా మహిళలకు అవగాహన కల్పించాలని కోరారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమయంలో సిజరింగ్ చేయడం వల్ల భవిష్యత్తు లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామాల్లో తిరిగే ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు,గర్భిణీలకు పౌష్టికాహారంతో పాటు సహజ ప్రసవాలు జరిగేలా వ్యాయామాలు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, పెద్దనపల్లి ఎంపీటీసీ కొండ బత్తుల రాంచందర్, ముత్యంపల్లి ఉపసర్పంచ్ బోయిన తిరుపతి , తెరాస కాసిపేట గ్రామ అధ్యక్షులు అగ్ని సత్తయ్య, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాసుదేవ్, నాంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి రేవల్లి విజయ్ కుమార్, మండల తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సర్పంచ్ కుమారుడి వివాహనికి హాజరు.
.ఆస్పత్రి తనిఖీ అనంతరం పల్లంగూడెం సర్పంచ్ దుస్స విజయ,చందు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరుల ను ఆశీర్వదించారు. ఆయన వెంట మండల జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, కాసిపేట దేవాపూర్ ఎస్సైలు కళ్యాణం నరేష్, విజయేందర్ నిక సర్పంచ్లు,మండల టిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.



