మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు.

 కాసిపేట మండలంలో

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో

మే డే ఉత్సవాలు.


Scv News Kasipet :--

కాసిపేట మండల కేంద్రంలో, దేవాపూర్  కాసిపేట 1,2 బొగ్గుగనులు, సోమగూడెం కొమురయ్య భవన్ వద్ద సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆధ్వర్యంలో మేడ సందర్భంగా ఎర్ర జెండాలను ఎగురవేశారు.  కాసిపేట ఒకటో గని వద్ద ఏ ఐ టి యు సి కాసిపేట గని పిట్ కార్యదర్శి బి వెంకట స్వామి ,  కాసిపేట టూ లో పిల్లీ వెంకటేశ్వర్లు  పిట్ కార్యదర్శి,  సోమగూడెం  (భరత్ కాలనీ) ఉన్న కామ్రేడ్ కొమురయ్య భవన్ కార్యాలయం ముందు బ్రాంచ్ సెక్రెటరీ కామ్రేడ్ దాగం మల్లేష్ ఎర్ర జెండాను ఆవిష్కరించారు. కాసిపేట మండలంలో బిల్డింగ్ వర్కర్స్ AITUC యూనియన్  జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జాడి పోషం గారు  దేవపూర్ యందు గట్టు సర్వేశం ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఎర్ర జెండాను ఎగరవేశారు .

ఈ సందర్భంగా మండల సిపిఐ కార్యదర్శి దాగం మల్లేష్   మాట్లాడుతూ 136 మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అమెరికా సామ్రాజ్యవాదం చికాగో నగరంలో జరిగిన పోరాటంలో కార్మికులపై  ప్రభుత్వం కాల్పులు జరిపినప్పుడు తమ హక్కుల కోసం ప్రాణత్యాగం చేసి మృతిచెందిన కార్మికులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ముందుకుపోవాలని పిలుపు ఇవ్వడం జరిగినది.

 నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తారు బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం  ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు గుత్తా దారులకు కార్పొరేట్ శక్తులు పనిగంటలు పెంచుతూ కార్మికులకు తీరని అన్యాయం చేసిన సందర్భంలో భారతదేశంలో ఉన్న కార్మికవర్గం 30 కోట్ల మంది సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించిన పట్టించుకోని సందర్భంలో ఈ మేడే సందర్భంగా ఇలాంటి ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలంటే కార్మికవర్గం ఏకతాటిపై వచ్చి తమ హక్కులకోసం పోరాటానికి సిద్ధం కావాలన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందని అన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామని సమ్మెలో నిరాహారదీక్షలు అవసరం లేకుండా శాంతియుతంగా సమస్యలు పరిష్కరిస్తామనిv హామీ లు టిఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని విమర్శించారు.

 కార్యక్రమం లో జూపాక కొమురయ్య, నాగేశ్వరరావు లక్ష్మీనారాయణ  రాజేందర్, ఆడెపు రవీందర్ బి నర్సయ్య గంప శ్రీనివాస్ బల్లెం శ్రీనివాస్,బండారి సత్యనారాయణ,సుధాకర్ గంగాధర్ రాజయ్య,ఉప్పులేటి మధునయ్యతదితరులు పాల్గొన్నారు.