మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థికి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సన్మానం.
SCV News Kasipet :--
కాసిపేట మండలం మల్కపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సోమవారం తుడుం దెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏడవ తరగతి విద్యార్థి చిక్రం రాజును సన్మానించారు. ఇటీవల 2022 జిల్లాస్థాయిలో నిర్వహించిన సైన్స్ ప్రాజెక్టులో గైడ్ టీచర్ వేములవాడ రమేష్ పర్యవేక్షణలో ఈజీ వాసు విత్ వాటర్ ఇన్ స్కూల్ అండ్ హాస్టల్ అనే ప్రాజెక్టు హై జాన్ అండ్ క్లీన్ లైన్స్ తీము లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనాడు. రాష్ట్రస్థాయికి ఎంపి కైన అందుకు చిక్రమ్ రాజు ను తుడుం దెబ్బ రాష్ట్ర జిల్లా కమిటీలు సన్మానించాయి. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి ఆడ జంగు, రొట్టెపల్లి సర్పంచ్ పెంద్రం కవిత, హన్మంతు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమంత్, జిల్లా ఉపాధ్యక్షుడు అనంతరావు, మండల శాఖ అధ్యక్షులు ఆత్రం జంగు, మండల ప్రధాన కార్యదర్శి మాడావి వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ రెడ్డి, గైడ్ టీచర్ వేములవాడ రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
