మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సోమగూడెం న్యూ కాలనీ లో వడదెబ్బతో రజకుడు మృతి

 సోమగూడెం న్యూ కాలనీ

లో వడదెబ్బతో  రజకుడు 

మృతి.

Scv News Kasipet :--

 కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీ లో రజక వృత్తి చేసే కంచర్ల  సమ్మయ్య  (55) ఆదివారం  మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం  రజక (చాకలి) వృత్తి చేసుకుని మధ్యాహ్నం 3 గంల సమయం లో ఇంటికి వచ్చిన తరువాత వాంతులు, విరోచనాలు అతిగా కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికీ తరలించే సమయం లో ప్రాణం వొదిలాడని తెలిపారు.ఇతనికి భార్య , ఇద్దరు కుమారులు ఉన్నారు. కంచర్ల సమ్మయ్య  సోమగూడెం పాతబస్తీలో చిన్నప్పటి నుండి రజక వృత్తి చేసు కుంటూనే  సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. గ్రామస్తులు అందరితో కలిసి మెలిసి ఉంటూ ఎంతో ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ సేవలు చేస్తూ ఉండేవాడు. అతడి మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సమ్మయ్య మృతికి గ్రామ

సర్పంచి సంతాపం.


వడదెబ్బతో మృతి చెందిన కంచర్ల సమ్మయ్య కుటుంబానికి పెద్దనపల్లి  గ్రామ సర్పంచి వేముల కృష్ణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సమ్మయ్య కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అని సోమగూడెం పాతబస్తీ నుండి తనకు ఆత్మీయుడు అని అన్నారు. నన్ను బాపు (నాన్న) అంటూ ముద్దుగా పిలుచుకునే వాడని  మా గ్రామంలో ప్రతి ఒక్కరి తో సత్సంబంధాలు కలిగి ఉంటూ  గ్రామంలో  తిరిగే మా బాపు మృతి చెందడం మా గ్రామానికి, కాంగ్రెస్ పార్టీకి తీవ్రలోటని  అన్నారు.సమ్మయ్య  మృతి తమ గ్రామంలో విషాదం నింపిందన్నారు. అతని కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు.