వరి దాన్యం కొనుగోలు
చేయాలని మోడీ దిష్టిబొమ్మ
దగ్ధం.
Scv News Kasipet:--
తెలంగాణ రాష్ట్రంలో వేసంగి లో పండించిన వరి ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కాసిపేట మండలం కొండాపూర్ యాప సెంటర్ లో మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించా రు. తదనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షు డు కేసీఆర్,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బెల్లంపల్లి నియోజక వర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ల పిలుపు మేరకు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా మోడీ దిష్టిబొమ్మను తగల పెట్టడం జరిగింది అని టిఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షులు విక్రమ్ రావు, సింగిల్విండో చైర్మన్ నీల ,మాజీ జెడ్పిటిసి రౌతు సత్తయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ మండల, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.
