మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా శ్రీరామ నవమి ఉత్సవాలు



 కాసిపేట మండలంలో 

ఘనంగా శ్రీరామ నవమి

ఉత్సవాలు.







Scv News Kasipet :--

 కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ధర్మారావు పేట గ్రామంలోని కోదండ రామాలయంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు దంపతులచే శ్రీ రామ కళ్యాణం వేద పండితులతో ఘనంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై  దేవాలయంలో పూజలు నిర్వహించి కళ్యాణంలో పాల్గొన్నారు.దేవాపూర్ సలపాలవాగు రామాలయంలో ఓరియం ట్ సిమెంట్ కర్మాగార అధ్యక్షుడు శివకుమార్ పాండే దంపతులచే రామ కళ్యాణ మహోత్సవం జరిగింది. దేవాలయ నిర్వాహకులు దేవాపూర్ మాజీ సర్పంచ్ కొడప ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. దేవాపూర్ లో అయ్యప్ప స్వామి గుడి, దేవాపూర్ గ్రామంలోని ప్రసన్నాంజనేయ గుడిలో, కాసిపేట, రేగుల గూడెం ముత్యం పల్లి దుబ్బగూడెం గ్రామాలలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున మహోత్సవాలకు హాజరయ్యారు.  దేవాలయాల వద్ద నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సల్పల వాగు  దేవాలయం వద్ద కల్కి భగవాన్ భక్తులు తాగునీటి సదుపాయం ఏర్పాటు చేశారు.