మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.



Scv News Kasipet :--

అలుపెరుగని బహుజన పోరాట యోధుడు బన్న ఆశన్న గురించి గత వారం రోజులు వరుసగా సంచలన కథనాలు గతంలో ఏ పత్రికలో ఇవ్వని విధంగా 'scvNews' డిజిటల్ పేపర్లో ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ ల   ద్వారా మండలంలోని అన్ని గ్రామల ప్రజలకు  వార్తా కథనాలు చేరాయి. అనూహ్య రీతిలో ప్రజల నుంచి స్పందన వచ్చింది. అంబేద్కర్,పూలే ఆలోచనా విధానంతో బహుజన వర్గాలు చైతన్యం చేయాలనే ఉద్దేశంతో  'ప్రతి అక్షరం -ప్రజల కోసం 'అనే లక్ష్యంతో  సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా పనిచేస్తుంది. గతంలో బహుజన  వర్గాల ప్రజలకు జరిగిన అణచి వేతలు,అన్యాయం తెలిపి  వారిని మేల్కోలిపి మళ్లీ అలాంటి ఘటన లు జరగకుండా ప్రజలను  చైతన్యవంతం చేయాలానేది మా ప్రధాన ఉద్దేశం.

 'చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మాణం చేయలేడన్న' బాబా సాహెబ్ అంబేద్కర్ సూక్తులను స్ఫూర్తిగా తీసుకొని  గత చరిత్ర  గురించి నేటి తరాలకు తెలుపాలని మాత్రమే వార్తాకథనాలు ఇవ్వడం జరిగిం దని తెలియ చేస్తున్నాము. ఆ కథనాలలో నేటి తరానికి ఆనాటి బహుజన కులాల లైన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎదుర్కొన్న సమస్యలు, ప్రజల కోసం పనిచేసే నాయకులపై,అగ్రకుల పెత్తందారు లైన దొరల అరాచకాల గురించి వాస్తవాలు మాత్రం తెలియ జేయడం జరిగింది.

* కథనాలపై వెలమ దొరల అభ్యంతరాలు.వాటికి మా సమాధానం. 

'అలుపెరగని బహుజన పోరాట యోధుడు' వార్తా కథనాలపై మండలంలోని కొంతమంది వెలమ దొరలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫోన్లు చేస్తు న్నారు.వెలమ దొరల అరాచకాలంటు మా వర్గాలను బదనాం చేయడానికి ఇస్తున్నావు?. ఎవరు అరాచకాలు చేశారో  వారి పేరు పెట్టి రాయాలని,వెలమ దొరలు అంటూ అందరి పేరుమీద రాయవద్దని కోరుతున్నారు. ఎప్పుడో జరిగిన సంఘటనలు ఇప్పటి తరాలు తెలిపి మా పరువు తీయడం సమంజసమా అంటూ మరికొందరు దొరలు  ప్రశ్నిస్తున్నారు. నేటికీ కొనసాగుతున్నాయని రాస్తున్నారు. ఇప్పుడు అలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటూ నాటి దొరల వారసుడు అడుగుతున్నారు.

వీరికి' scv News' చెప్పే సమాధానం ఒక్కటే.

అలుపెరగని బహుజన పోరాటయోధుడు  కథనాలలో  మేము వెల్లడించిన ప్రతి అంశం అక్షర సత్యం. వాటికి మేం కట్టుబడి ఉన్నాం. అందులో ఎవరినో బదనాం  చేయాలి అని రాయడం లేదని ఆ వర్గాలు గమనించాలి. వార్త  కథనాలు ప్రారంభం లోనే మేము చెప్పాము. అగ్రకుల  పెత్తందారులైన వెలమ దొరలు,రెడ్లకు తాము వ్యతిరేకం కాదని చెప్పాము. బహుజన వర్గ ప్రజల కోసం పని చేసే వారిని గౌరవిస్తాం అని, ప్రజల మీద అరాచకాలు చేసినవారి గురించి నేటి తరానికి తెలియజేస్తామని తెలిపాం. వారి పేర్లు పెట్టి రాయలనడం పత్రిక నిబంధ నలకు విరుద్ధం  కాబట్టి రాయ లేక పోయాము. అరాచకలు చేసిన వారెవరు మండల ప్రజలందరికీ తెలుసు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. నేడు బహుజన వర్గాలను మేము అణిచి వేస్తున్నాము అనేది అబద్ధమని అలాంటి సంఘటనలు జరుగు తున్నాయని ప్రశ్నించే వారికి నా సమాధానం. మండలం లో 99% బహుజన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రజాప్రతినిధులుగా ఉన్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో వారికి మాట్లాడే స్వేచ్ఛ లేదు. పార్టీ క్రమశిక్షణ అంటూ అగ్రకుల పెత్తందారీలైన మీరు వెనక ఉండి  మావర్గ ప్రజాప్రతినిధులు గ్రామాల ప్రజల పై ఒత్తిడి తేవడం నిజం కాదా? తమ పరిధిలోని గ్రామాల ప్రజల  సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చిన పరిష్కరించకుండా నోరు ముయించడం అబద్దమా?  ఆలోచించిం చండి.

 * బహుజన వర్గాల ప్రజల  నిజమైన చరిత్ర  నేటి ప్రజలకు తెలపడంలో  వెలమ దొరల అభ్యంతరం ఏమిటి?

ఈ దేశంలో  మెజార్టీ వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ  బహుజన వర్గాల అసలైన చరిత్రను దోపిడి వర్గాలైన అగ్రకుల పెత్తందార్లు, పాలకవర్గాలు ఇన్నాళ్లు తెలియకుండా చేశాయి. తెలిస్తే ఆ వర్గాలు తిరగబడితే తమ పుట్టగతులు ఉండవని దోపిడి వర్గాలకు భయం . బహుజన వర్గాల నిజమైన చరిత్ర తెలియ కుండా వేల సంవత్సరాలుగా ఈ దేశంలోని అగ్రకుల పెత్తందారులు, బ్రాహ్మణీయ భావజాలం గల  మనువాదులు అడ్డుకున్నారు. చదువు వారికి మాత్రమే పరిమితం కావడం వల్ల నిజమైన చరిత్ర ను వక్రీకరించి వారికి అనుకూలంగా చరిత్రను రాసి ఇదే మీ నిజమైన  చరిత్ర అంటూ ఇన్నాళ్లుగా  బహుజన వర్గాలను  మోసం చేస్తున్నారు. బహుజన బాంధవు లైన పూలే, అంబేద్కర్ విశేషా కృషి వలన  ఈ దేశం మూలవాసులైన బహుజనులకు అసలు చరిత్ర బయటకు వచ్చింది. వారి ఆలోచనల విధానాలతో పనిచేసే నేటి తరం నిజమైన చరిత్ర  ప్రజలకు తెలిపితే  దోపిడి  పాలక వర్గాలు సహించలేక పోతున్నారు. వారిని ఎన్నో రకాల వేధింపులకు గురిచేస్తూన్నాయి. ఇది వారి వర్గ సహజ లక్షణం.

నేడు కాసిపేట మండలంలో కూడా అదే జరుగుతుంది. మండలంలో దొరల అరాచకాలతో ఎన్నో  బహుజన వర్గాల కుటుంబాలు చెల్లాచెదురైనవి ఎన్నో ఉన్నాయి. అప్పుడు వారి గురించి బాహ్య ప్రపంచానికి తెలిపేవారు లేక  కనుమరుగైనాయి.ఇప్పుడిప్పుడే కొన్ని  వెలుగు చూస్తున్నాయి. వీటిని చూసి నేటి దొరలు ఉలిక్కి పడుతున్నారు. 'అలుపెరుగని పోరాట యోధుడు' కథనంలో మండలంలోని కొంత మంది వెలమ దొరల  అరాచకాల గురించి 10 శాతం మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఇంకా చాలా సంఘటనలు  ఉన్నాయన్న విషయము దొరలు గుర్తుంచు కోవాలి.

* 'యదార్థవాది లోకవిరోధి' అనేది చారిత్రక సత్యం.

'యదార్థవాది లోకవిరోధి' పూర్వీకుల నానుడి ప్రకారం నిజాలుచెప్పే వారు లోకానికి (దోపిడి వర్గాలకు) శత్రువులు గా కనిపిస్తారు. పీడితవర్గ ప్రజలలైన బహుజనులకు యదార్థవాది చెప్పేది నిజమని తెలిసినా దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా నోరు మెదపలేరు.యదార్థ వాదులకు మద్దతు తెలిపితే దోపిడి వర్గాలైన పాలకుల చేతిలో  హింసించ పడతామనే భయంతో కళ్ళ ముందు అన్యాయాలు,అక్రమాలు జరిగినా మాట్లాడలేరు.చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా కనబడతాయి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి యదార్థ వాదులు చార్వాకులు, లోకాయతులు, అప్పటి మనువాద బ్రాహ్మణ పూజారులు  స్వర్గ,నరకాలు, పూర్వ జన్మ అంటూ ప్రజలను దోపిడీని చేస్తుంటే  అవి ఎక్కడ లేవని, ఉన్నాయని ప్రజలను మోసం చేసి మీ కడుపు నింపుకుంటున్నారు అని  చార్వాకులు ప్రశ్నించారు.  నిజాలు మాట్లాడి నందుకు  చార్వాకులను, బౌద్ధ సన్యాసులను మనువాద బ్రాహ్మణులు పాలకవర్గాలతో కలిసి వారిని పట్టుకొని చెవుల్లో సీసం పోసి,నాలుకలు కోసి చిత్రహింసలు పెట్టి చంపించారు. స్వర్గ,నరకాలు పూర్వ,జన్మలు ఉన్నాయని ఎవరు ఇంతవరకు నిరూపించ లేకపోయ యారు.

ఆధునిక ప్రపంచంలో పాశ్చాత్య దేశాలలో  భూమి గుండ్రంగా ఉందన్న సత్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలిపిన గెలీలియోను, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అన్న సత్యాన్ని  ప్రపంచానికి తెలిపిన బ్రూనోను ఆనాటి మత గురువులు, పాలకవర్గాలు జీవితాంతం జైల్లో  హింసించి నడిరోడ్డుపై సజీవ దహనం చేశాయి. వారు బాహ్య ప్రపంచానికి తెలిపిన నిజాలను మాత్రం అబద్ధమని దోపిడీ వర్గాలు నిరూపించలేక పోయాయన్న నగ్న సత్యం అందరూ  తెలుసుకోవాలి. 

Scv News బహుజన వర్గాల కోసమే పని చేస్తుంది.

సామాజిక చైతన్య వేదిక డిజిటల్, సోషల్ మీడియా మండలంలో 99 శాతం ఉన్న  బహుజన వర్గాల కోసమే పని చేస్తుందని తెలియ జేస్తూన్నాము. నీతి నిజాయితీ గా ఉంటూ నైతిక విలువలకు కట్టుబడి బహుజన వర్గాల్లో మానసిక ప్రవర్తన తెచ్చి చైతన్య వంతం చేసి సంతోషంగా జీవించాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాము. 'ద్వేషాన్ని ద్వేషం జయించదు.ప్రేమ పూర్వకంగానే ద్వేషాన్ని జయించాలి.' అన్న బౌద్ధ మౌలిక సూత్రాన్ని ఆధారంగానే మేము పని చేయదలచుకున్నాము. అందరితో కలిసి మెలిసి ఉంటూ శత్రుత్వం పెంచుకోకుండా ఆశావాద దృక్పథంతో నే ఈ మీడియాను మేము నడపతలచుకు   న్నాం . ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు  వ్యతిరేకంగా, అనుకూలంగా వార్తలు ఇవ్వడం జరగదు. ఇవి ఇచ్చేందుకు ప్రస్తుతం మీడియా ఉంది. మా మీడియా మాత్రం కనుమరుగయిన బహుజన పోరాట యోధుల చరిత్రల గురించి, వారు ప్రజలకోసం చేసిన మంచి పనులు,కళా కారుల గురించి, నేటి తరం యువత, విద్యార్థుల చైతన్యం గురించి మాత్రమే ఇస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులో పెట్టిన రాజకీయ పార్టీల వార్తలను మాకు సమయాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. మా మొదటి ప్రాధాన్యత మండలంలో బహుజన వర్గాలను చైతన్యం చేసే సామాజిక చైతన్య వేదిక, అంబేద్కర్ సంఘాల కార్యక్రమాలను ప్రజలకు తెలియ చేసేందుకు మా మీడియా పని  చేస్తుందని తెలియజేస్తున్నాం. వీటితో పాటు మాకు ఉన్న సమయాన్ని బట్టి  మండలంలోని గ్రామాలలోని సమస్యలు  బహుజనులకు జరిగే అన్యాయాలను, అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరిం చేందుకు మా శాయశక్తులా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.

* మండల ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి అలుపెరగని పోరాటం చేస్తున్న మరో బహుజన పోరాటం యోధుడు జీవిత చరిత్రను త్వరలో అందించ బోతున్నాము.

 *  అలుపెరుగని బహుజన పోరాటయోధుడు బన్న ఆశన్న జీవిత చరిత్ర కథనాలు  పేపర్ ప్రింట్ ప్రతులు కాసి పేట గ్రామంలోని స్వీట్ హౌస్ పక్కనే ఉన్న  శివ డిజిటల్ కంప్యూటర్ సెంటర్లో దొరుకుతాయి. ఆసక్తి ఉన్నవారు వారి వద్ద నుండి తీసుకోగలరు. ఫోన్ నెంబర్  7075675552 సంప్రదించగలరు.

         ఇట్లు

పల్లె మల్లయ్య

కాసిపేట మండలం

సామాజిక చైతన్య వేదిక

సోషల్, డిజిటల్ మీడియా సమన్వయకర్త.