మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 సమయాన్ని సద్వినియోగం

చేసుకుంటూ  లక్ష్యంపై దృష్టి

పెడితే పరీక్షల్లో  విజయం

సాధిస్తారు.

 కాసిపేట మండల

కేంద్రంలోని  ఆదర్శ

పాఠశాలలో మాట్లాడిన

- ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్

మద్దినేని అర్జున్.






Scv News Kasipet :-

 విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యంపై దృష్టి పెడితే  పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారని ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దినేని అర్జున్ అన్నారు. శుక్రవారం కాసిపేట మండల కేంద్రము లోని ఆదర్శ  పాఠశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలపై విద్యార్థులకు అవగాహన  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహనీయులఅందరూ సమయాన్ని సక్రమంగా వినియోగించు కోవడం వల్లనే మహాత్ములయ్యా రన్నారు. అందరికి రోజుకు 24 గంటలే వున్నా కొందరు మాత్రమే సద్వినియోగం చేసుకుంటు న్నారని  అన్నారు.'సమయాన్ని వృధాచేయడం అంటే నిన్ను నీవు దోపిడీ చేసుకోవడమే అన్నా'  గౌతమ బుద్ధుడి సూక్తి ని విద్యార్థులకు గుర్తు చేశారు. సృష్టిలో సమయం విలువ వెలకట్టలేనిది అని మళ్ళీ తీసుకురాలేము కాబట్టి సమయాన్ని వృధా చేయవద్దని విద్యార్థులను కోరారు. సమయం విలువ గురించి వాళ్లకు అర్థమయ్యే విధంగా చిన్న చిన్న కథలను చెప్పాడు. విద్య  నేర్చుకోవడం వల్లనే సమాజంలో గౌరవం లభిస్తుందని విద్యార్థులు నిరంతరం చదువుకుంటూనే ఉండాలని అన్నారు. ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుందని లక్ష్యం పెట్టుకుని జీవించేవారు లీడర్ అవుతారని, లక్ష్యం లేకుండా తిరిగే వారు లేబర్ గా మిగులుతారని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు లక్ష్యం లేకుండా జీవించడం వల్ల ఏమి  సాధించలేకపోతున్నారు అని అన్నారు.  పరీక్షల్లో అత్యధిక మార్కులు రావాలంటే  బట్టి పట్టకుండా విజు వలేషన్  ద్వారా చదవాలని సూచించారు. 

పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు గణేష్ మాట్లాడుతూ   విద్యార్థులు మోటివేటర్ అర్జున్ చెప్పిన విషయాలను ఆకళింపు చేసుకొని పరీక్షల్లో పదికి పది మార్కులు సాధించాలని పదవ తరగతి విద్యార్థులను కోరారు. అవగాహన తరగతులు ఏర్పాటు చేసిన సామాజిక చైతన్య వేదిక కు అభినందనలు  తెలిపారు.

సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా కాలాన్ని,మనసును సరిగా వాడుకోవాలని సూచించా రు. మనిషి ఉన్నతికి పతనానికి ఇవే కారణమని అన్నారు.కాలాన్ని వృధా చేయవద్దని సరిగా వాడు కోవాలని అన్నారు.  . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగమల్లయ్య, ఉపాధ్యాయులు అభిలాష్, దుస్స కుమార్ తదితరులు పాల్గొన్నారు.