మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

స్వాతంత్ర సమరయోధుడు రాంజీగోండు 162 వర్ధంతి.


దేవాపూర్  

నాయకపుగూడెంలో

స్వాతంత్ర సమరయోధుడు

రాంజీగోండు 162 వర్ధంతి.



Scv News Kasipet :--

కాసిపేట మండలం దేవాపూర్ పంచాయతీ పరిధిలో నాయక పు గూడా పాఠశాల ఆవరణలో శనివారం  ఆదివాసి అమరుడు మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు రాంజీగోండు 162 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించారు. నాయకులు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా   రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు మాట్లాడుతూ బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారత ప్రజల విముక్తి కోసం రాంజీగోండు పోరాటాలు ప్రారంభించాడని అన్నారు. దేశంలోని అడవి ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద, భూములను బ్రిటిష్ వారు దోచుక పోవడంతో సిపాయిల తిరుగుబాటు కంటే ముందు ఆదివాసి ప్రజలను ఐక్యం చేసి గెరిల్లా పోరాటాన్ని ప్రారం భించాడన్నారు.  దీన్ని జీర్ణించుకోలేక బ్రిటిష్ పాలకులు ఆదివాసి గిరిజనులపై అక్రమ యుద్ధం ప్రారంభించిందన్నారు. వేలాది మంది ఆదివాసులను  హతమార్చి దొంగచాటున గిరిజన పోరాట యోధుడు  రాంజీగోండు ను నిర్బంధించిందన్నారు. రాంజీ గోండు తోపాటు వేయి మంది ఆదివాసి యుద్ధవీరులను నిర్బం ధించి నిర్మల్ ప్రాంతంలో వెయ్యి ఊడలమర్రి చెట్టుకు ఉరి తీయడం జరిగిందన్నారు.ఇంత పెద్ద చరిత్రగల అమరవీరులను స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కేంద్ర రాష్ట్ర పాలకులు ఇప్పటి వరకు ఆయన పోరాటాన్ని గుర్తించకపోవడం శోచనీయం అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన పోరాట చరిత్రను ఇప్పుడున్న సమాజానికి అందించాలని ఆయన జయంతి వర్ధంతి లను అధికారికంగా నిర్వహించాలని ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం గా డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు... కొమ్ముల రజిత ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి మంచిర్యాల జిల్లా, నాయకపోడు ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు మెయిన్ డ్రాప్ రాజన్న, గ్రామ పూజారి రోడ్డ లచ్చయ్య, గ్రామ కమిటీ సభ్యుడు,కొమ్ముల సంజీవ్, పసుపు నోటి సత్తయ్య ,మరియు  విద్యార్థులు పాల్గొన్నారు..