బ్రాహ్మణ మనువాదుల
కుట్రలను బట్టబయలు చేసిన
మహాత్మ జ్యోతిరావు పూలే.
- పల్లె మల్లయ్య,
అంబేద్కర్ యువజన
సంఘం మండల
ముఖ్య సలహాదారు.
Scv News Kasipet :--
భారతదేశంలో బహుజన వర్గాలను రెండు వేల సంవత్సరాలుగా తీవ్రంగా అణిచి వేస్తున్న బ్రాహ్మణ మనువాదుల కుట్రలను బట్టబయలు చేసిన సామాజిక ఉద్యమ కారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని అంబేద్కర్ యువజన సంఘం మండల ముఖ్య సలహాదారు పల్లె మల్లయ్య అన్నారు.
కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం మహాత్మ జ్యోతిరావు పూలే 195 వ జన్మదినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దక్షిణాసియా నుండి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణులు యుద్ధాలలో స్థానిక మూలవాసులైన ద్రావిడ రాజులను ఓడించి భారత దేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారన్నారు. మెజారిటీ వర్గాలైన బహుజనులను పాలించడం కోసం వేదాల ద్వారా చాతుర్వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసి వేలాది కులాలుగా విభజించారని అన్నారు. మూలవాసి ద్రావిడ రాజులను రాక్షసులుగా చిత్రీకరించి, అక్రమ పద్ధతులతో యుద్ధాలలో ఓడించిన ఆర్యులను దేవత మూర్తులు అంటూ మూలవాసీ ప్రజలైన బహుజనులతో నేటికీ పూజింప చేస్తున్నారని విమర్శించా రు.
చదువుకునే హక్కు మనుధర్మ శాస్త్రం ప్రకారం బ్రాహ్మణులకే పరిమితం అయి ఉండడం వల్ల బహుజన వర్గాలు చదువు లేకపోవడం వల్లనే అజ్ఞానంలో ఉంటు న్నారు అని పూలే గుర్తించారన్నారు. బహుజన పిల్లలకు చదువు నేర్పడం బ్రాహ్మణ వర్గాలు వ్యతిరేకించిన భారత దేశంలో మొట్ట మొదటి పాఠశాలలో ప్రారంభించిన మహనీయుడు మహాత్మ పూలే అని అన్నారు. మహిళలకు చదువు నేర్పేందుకు తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి మొట్ట మొదటి మహిళ పాఠశాలల ను నెలకొల్పిన వ్యక్తి మహాత్మా పూలే అని కొనియాడారు. బహుజన వర్గాలను చైతన్యవంతం చేసిన జ్యోతిరావు పూలే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుగా స్వీకరించాడు అని అన్నారు.
అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదినోత్సవ కార్యక్రమాలు సోమవారం కాసిపేట మండలంలో ఘనంగా జరిగాయి. మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముత్యంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు గొడిసెల భీమన్న, ఆధ్వర్యంలో మండల ముఖ్య సలహాదారులు పల్లె మల్లయ్య లంక లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శి గొడిసెల సురేందర్, మండల నాయకుడు దాసరి శంకర్ మాజీ జెడ్పిటిసి రౌత్ సత్తన్న, కాసిపేట మాజీ ఉపసర్పంచ్ మెడ రాంచందర్, గొడిసెల బాలయ్య జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో పూలే భారత దేశానికి చేసిన సేవలను సలహాదారు పల్లె మల్లయ్య, సమావేశానికి అధ్యక్షత వహించిన గొడిసెల సురేందర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
దేవాపూర్ మేజర్ పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ భవన్లో మహాత్మా జ్యోతి రావు పూలే జన్మదిన కార్యక్రమం గ్రామ కమిటీ అధ్యక్షుడు గశికంటి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు జాడి రామచందర్, ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం పురుషో త్తం, మండల ప్రచార కార్యదర్శి గోనె రవీందర్,గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు కొమ్ము సంతోష్, కమిటీ సభ్యులు గొడిసెల సతీష్, మనోహర్ కాంబ్లే లు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు. మనోహర్ కాంబ్లే బుద్ధ వందనం చేశారు. నాయకులు పూలే దేశానికి సేవలు చేసిన సేవలను కొనియాడారు.
కార్య క్రమానికి అధ్యక్షత వహించిన గొడిసెల సురేందర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే దేశంలోని బహుజన వర్గాలకు చదువు నేర్పి చైతన్యవంతం చేసేందుకు ఎంతో కృషి చేశాడని అన్నారు. పూలే ఆశయాల ఈ సాధన కోసం అందరం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఆర్ సత్తయ్య, ముత్యం పల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గొడిసెల భీమయ్య, మండల సలహాదారులు లంక లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు అగ్గి సత్తయ్య, కాసిపేట పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ మేడ రామ్ చందర్ మండల సంయుక్త కార్యదర్శులు లంక రాకేష్, దాసరి శంకర్, సోషల్ మీడియా ఇంచార్జ్ సాయి కుమార్,సభ్యులు గొడిసెల బాలయ్య, స్వామి,అభినవ్, అన్వేష్, జాల శ్రీనివాస్, పల్లె మహేష్, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 195 వ జన్మదినోత్సవ కార్యక్రమాలు.
అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదినోత్సవ కార్యక్రమాలు సోమవారం కాసిపేట మండలంలో ఘనంగా జరిగాయి. మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముత్యంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు గొడిసెల భీమన్న, ఆధ్వర్యంలో మండల ముఖ్య సలహాదారులు పల్లె మల్లయ్య లంక లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శి గొడిసెల సురేందర్, మండల నాయకుడు దాసరి శంకర్ మాజీ జెడ్పిటిసి రౌత్ సత్తన్న, కాసిపేట మాజీ ఉపసర్పంచ్ మెడ రాంచందర్, గొడిసెల బాలయ్య జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో పూలే భారత దేశానికి చేసిన సేవలను సలహాదారు పల్లె మల్లయ్య, సమావేశానికి అధ్యక్షత వహించిన గొడిసెల సురేందర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
దేవాపూర్ లో...
దేవాపూర్ మేజర్ పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ భవన్లో మహాత్మా జ్యోతి రావు పూలే జన్మదిన కార్యక్రమం గ్రామ కమిటీ అధ్యక్షుడు గశికంటి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు జాడి రామచందర్, ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం పురుషో త్తం, మండల ప్రచార కార్యదర్శి గోనె రవీందర్,గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు కొమ్ము సంతోష్, కమిటీ సభ్యులు గొడిసెల సతీష్, మనోహర్ కాంబ్లే లు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు. మనోహర్ కాంబ్లే బుద్ధ వందనం చేశారు. నాయకులు పూలే దేశానికి సేవలు చేసిన సేవలను కొనియాడారు.
ముత్యం పల్లి గ్రౌండ్ లో జ్యోతిరావు పూలే జయంతి.
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి మైదానం తో క్రీడాకారులు మహాత్మా జ్యోతిరావు పూలే జన్మ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి ముత్యం పల్లి సర్పంచ్ ఆడే బాదు, సర్పంచి బోయిన తిరుపతి యాదవ్, మెరుగు శీను,బలరాం, వేల్పుల స్వామి, వినయ్ దార్ ఖాన్, రమేష్ మహేందర్ మహి పూలమాలలు వేశారు.