నిజాయితీ చాటుకున్న
కాసిపేట జర్నలిస్ట్ ఏల్పుల
అనిల్ కుమార్.
Scv News Kasipet :--
రోడ్డు మీద పది రూపాయలు దొరికితే ఎవరు చూడడం లేదని అటు ఇటు చూసి తీసుకుని జేబులో పెట్టుకునె ఈ రోజుల్లో... 20 వేల విలువగల సెల్ ఫోన్ దొరికిన తనది కాదు అనుకుని పోగొట్టుకున్న వారికి అందజేసి నిజాయితీని చాటుకున్నాడు యువ జర్నలిస్ట్ ఏల్పుల అనిల్ కుమార్.సెల్ ఫోనును అందించిన అనిల్ కుమార్ ను పలువురు అభినందిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి...
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన ఏల్పుల అనిల్ కుమార్ కాసిపేట మండల దిశ పత్రిక జర్నలిస్ట్, కాసిపేట ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ. శనివారం ఉదయం బస్సులో గోదావరిఖని నుంచి కాసిపేటకి వస్తుండగా బస్సులో మొబైల్ దొరికింది. బస్సులో ఇతరులను మొబైల్ కోసం అడగగా మాది కాదు అంటూ సమాధానం చెప్పారు. మొబైల్ విలువ సుమారు రూ.25,000 ఉంటుంది. దీనితో మొబైల్ కాసిపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ మేరకు మొబైల్ యజమాని రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ రెడ్డి తన మొబైల్ పోగొట్టుకున్నట్లు గుర్తించారు.
ఈ మేరకు కాసిపేట పోలీస్ స్టేషన్ లో కాసిపేట ఎస్ఐ కళ్యాణం నరేష్ చేతుల మీదుగా మొబైల్ ను యాజమాని శ్రీనివాస్ రెడ్డి కి అందించారు.ఈ సందర్బంగా జర్నలిస్ట్ అనిల్ కుమార్ ను కాసిపేట ఎస్ఐ కల్యాణం నరేశ్ అభినందిం చారు.అనంతరం మొబైల్ యాజమాని శ్రీనివాస్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ అనిల్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోసం పనిచేసే ఒక జర్నలిస్టుగా తన వృత్తి ధర్మానికి న్యాయం చేసే విధంగా సెల్ ఫోను సొంతదారుకు అందజేసిన అనిల్ కుమార్ నిజాయితీని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూప్ అభినందనలు తెలియజేస్తుంది.
