మద్దిమాడ లో ఆదివాసీ
నాయకపోడ్ సమావేశం.
Scv News Kasipet :--
కాసిపేట మండలంలోని మద్దిమడ గ్రామ పంచాయితీ పరిధిలోని మద్దిమాడ నాయకపోడ్ గ్రామంలో ఆదివారం ఆదివాసి నాయకపోడ్ సేవాసంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో ఈనెల 24న ఆదివాసీల హక్కులకోసం పోరాడి అసువులు బాసిన అమరుడు చేనేని భీమయ్య వర్ధంతి కార్యక్రమం చర్చించి ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా పూజా కార్యక్రమాలు సభా నిర్వహణ గురించి తీర్మానం చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి ఆదివాసీ సంఘాల నాయకులు ఆదివాసీ ప్రజలు దళిత సంఘాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు రోడ్డలక్ష్మి, మాజీ సర్పంచ్ రోడ్డ రమేష్ ఆదివాసి నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రొడ్డ గోపాల్, ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం మండల అధ్యక్షులు బద్ది శ్రీనివాస్, నాయుడు మల్లేష్, బద్రి శ్రీనివాస్, మద్ది మాడ గ్రామ కమిటీ అధ్యక్షులు సోమని పోసక్క మహిళ కార్యదర్శి,భీమిని మహేందర్ మండల ఉపాధ్యక్షులు. రెడ్డి లక్ష్మణ్ సాంస్కృతిక కార్యదర్శి.మెయిన్ డ్రా పు రాజన్న ప్రధాన కార్యదర్శి. బైరి నేని మల్లేష్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.
