అంతర్జాతీయ కార్మిక
దినోత్సవం 'మే డే 'ను
అంబేద్కర్ 'మే డే 'గా
జరుపుకుందాం.!
Scv News Kasipet:--
భారత దేశ బహుజనుల ఆరాధ్యదైవం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు దేశంలోని కార్మిక వర్గానికి ఉన్న సంబంధాలను మేడే సందర్భంగా తెలుసుకుందాం!
దేశంలోని 85 శాతం ఉన్న బహుజనులకు అంబేద్కర్ ఓటు హక్కు, రిజర్వేషన్లు కల్పించాడు అన్న సంగతి మాత్రమే తెలుసు. దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం కోసం కార్మికుల కోసం కూడా ఎన్నో హక్కులను సాధించిపెట్టాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు.ఈ విషయాన్ని అగ్రకు ల అహంకారంతో ఉన్న కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల నాయకత్వం ఉద్దేశ పూర్వకంగానే అంబేద్కర్ ను విస్మరించాయి. భారతదేశంలో కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పని దినాలు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విషయాన్ని భారత దేశ ప్రజలకు తెలవకుండా కమ్యూనిస్టులు మేడే సందర్భంగా అంబేద్కర్ పేరు గాని ఫోటో కాని పెట్టకుండా కార్మిక దినోత్సవ కార్యక్రమాలు జరుపుకోవడం విచారకరం.
ప్రపంచవ్యాప్తంగా కార్మికులు 14 గంటల పనిదినం నుండి ఎనిమిది గంటల పని దినం కొరకు 19వ శతాబ్దంలో యూరప్ అమెరికా దేశాల్లో విరోచిత పోరాటాలు చేశారు. అందులో భాగంగానే అమెరికాలో ని చికాగో పట్టణంలో 1884 మే 4న లక్షలాది మంది కార్మికులు వీధుల్లోకి వచ్చి ఊరేగింపు నిర్వహించారు.ఆ ఊరేగింపు లో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు వేయడంలో పోలీసులు కాల్పులు ప్రారంభించారు. కాల్పుల్లో చాలా మంది కార్మికులు ప్రారంభించారు.రక్తపు మడుగులో పడి ఉన్న కార్మికులు తమ చొక్కాలను రక్తంలో ముంచి ఎగుర వేయడంతో ఎర్రజెండా పుట్టుకొచ్చింది. అమరవీరుల పోరాట ఫలితంగా 1890 నుండి ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది గంటల పని దినాలు అమలులోకి వచ్చింది.
బ్రిటిష్ వలస పాలనలో ఉన్న భారతదేశంలో మాత్రం ఎనిమిది గంటల పని దినములు అమలుకు నోచుకోలేదు. బ్రిటిష్ ప్రభుత్వ హాయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ లేబర్ మెంబర్ గా బ్రిటిష్ వైస్రాయ్ కమిటీలో 7 జులై 1942 నుండి 1946 వరకు పనిచేశారు. అతడి హయాంలోనే భారతదేశంలో కార్మికులకు ఉద్యోగులకు మహిళలకు ఎన్నో హక్కులను కల్పించారు. అవే హక్కులు భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్భై నాలుగు సంవత్సరాలుగా నేటికీ కొనసాగు తున్నాయి. కార్మికులు కనీస వేతనాలు, ఈ ఎస్ ఐ పెన్షన్, జీవిత బీమా, ప్రావిడెంట్ ఫండ్ లాంటి సుమారు 20 హక్కులను చట్టబద్ధంగా కల్పించిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంతర్జాతీయ కార్మికదినోత్సవం నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు, ఫోటోలు మాత్రం కనపడవు. నేటికీ బహుజన కార్మికుల మైన మనకు కూడా తెలవ కుండా అగ్రవర్ణాల నాయకత్వంలోని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు చరిత్రను వక్రీకరించి అంబేద్కర్ ను అంటరాని వాడంటూ పేరు వినకుండా చేశారు.
భారతదేశ కార్మికవర్గం కోసం అంబేద్కర్ కల్పించిన హక్కుల గురించి తెలుసుకుందాం..!
1) భారతదేశంలోని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు 14 గంటల నుండి ఎనిమిది గంటల పని దినాలను 27 నవంబర్ 1942లో న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ లో 7వ సెషన్ లో ఆమోదం పొందేలా అంబేద్కర్ కృషి చేశాడు. అప్పటినుండి దేశంలోని పరిశ్రమలలో 8 గంటల పని దినాలు ప్రారంభమయ్యాయి.
2) మహిళ కార్మికుల కోసం చట్టాలు తెచ్చాడు. బావులు పనిచేసే మహిళల పై నిషేధం ఎత్తివేత, మహిళల కార్మికుల ఆరోగ్యాన్ని కల్పించే విధంగా కాలకృత్యాలు తీర్చుకునేందుకు, చిన్న పిల్లల పోషణ ఈ విధంగా పలు హక్కులను సాధించిన పెట్టాడు.
3) భారత పరిశ్రమల చట్టం అంబేద్కర్ హయాంలోనే ఏర్పడింది.
4) ప్రస్తుతం నిరుద్యోగులు ప్రభుత్వ పరిశ్రమలలో ఉద్యోగాల కోసం నమోదు చేసుకుంటున్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చట్టం ఏర్పాటు.
5) ఈఎస్ఐ ఆస్పత్రి చట్టం కింద కార్మికులు పెద్దాస్పత్రిలో వైద్య చికిత్సలు పొందడం బీమా సదుపాయం కల్పించింది ఆ మహనీయుడే. చట్టం కింద నేటికీ లక్షలాది మంది కార్మికులు లబ్ధి పొందుతున్నారు.
6) కర్మాగారాలలో పనిచేసే ఉద్యోగులకు DA చట్టం తెచాడు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పాయింట్ల ప్రాతిపాదికన వేతనాలు పెంచడం జరుగుతుంది.
7) లీవుల సదుపాయం. సిక్కు,సి ఎల్, వేతనంతో కూడిన సెలవులు )
8) పే రివిజన్ ఏర్పాటు. ప్రతి 4,5 ఏళ్లకు వేతనాలు పెంచుకోవడం.
8) భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే బొగ్గు అత్యవసరమని అంబేద్కర్ గుర్తించి కార్మికుల కోసం కోల్ మైన్ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ సౌకర్యం 1944 జనవరి 31న కల్పించారు. గృహవసతి నీరు వద్దు వైద్యం 1946 ఏప్రిల్ 8న బిల్లు తీసుకు వచ్చి వాళ్లు చేయించడంలో క్రియాశీల పాత్ర పోషించారు.
9) కార్మిక చట్టాలు, సంఘాలు ఏర్పాటు లో అంబేద్కర్ కృషి ఉంది . దేశంలో 1920లో ఇండియన్ లేబర్ యాక్ట్ ఉండేది. అమెరికా సంఘాలకు మాత్రం 1943లో బిల్లు పెట్టి కార్మిక సంఘాల ఏర్పాటు వాటి గుర్తింపు ఇచ్చాడు.
10) కార్మికుల ఆరోగ్యం విషయమై చట్టం తెచ్చాడు.
11) కార్మికులకు ఈపీఎఫ్ తన కింద యాజమాన్యం కార్మికుల మూల వేతనంలో 12 శాతం జమ చేస్తే కార్మికులు 12 శాతం జమచేసి ఇవ్వడం, పెన్షను,రుణ సదుపాయాలు తీసుకోవడం లాంటి చట్టం తెచ్చాడు.
12) కనీస వేతన చట్టం అంబేద్కర్ కృషి వల్లనే వచ్చింది.భారతదేశంలోని ప్రైవేట్ పరిశ్రమలలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతన చట్టం తెచ్చాడు.
13) ఫ్యాక్టరీ ల ఏర్పాటు చట్టం.
14) ఫ్యాక్టరీ వివాదాల చట్టం
15) సమ్మే హక్కు చట్టం తెచ్చింది అంబేద్కర్ మహనీయుడే. సమ్మె హక్కును రాజకీయాలకు సంబంధం లేకుండా కార్మిక హక్కుల కోసం ఉపయోగించాలని 1936లో ఇండియన్ లేబర్ పార్టీ ఏర్పాటు చేసి ముంబాయిలో కార్మికులతో తమ హక్కుల సాధన కోసం సమ్మె పిలుపునిచ్చాడు.
కార్మిక హక్కుల తో పాటు ఈ దేశ అభివృద్ధిలో కీలకంగా ఉన్న జల వనరుల సద్వినియోగం ప్రాజెక్టుల నిర్మాణం కోసం కూడా కేంద్ర నీటి చట్టం లాంటి ప్రత్యేక చట్టాలు తెచ్చాడు. అంబేద్కర్ మదిలో నుండి వచ్చిన ఆలోచన వల్లనే పవర్ గిడ్, హిరాకుడ్, బాక్రానంగల్, మహానది లాంటి బహుళార్ధక నీటిపారుదల ప్రాజెక్టులు ఏర్పాటు చేయబడ్డాయి. వాటి నిర్మాణం తో దేశం ఎంతో అభివృద్ధి పథంలోకి పయనిస్తుంది. కాని ఆ ప్రాజెక్టుల శిలాఫలకాలు మాత్రం అంబేద్కర్ పేరు కనబడదు. ఇది... ఈ దేశంలోని మనువాదులు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన నిర్లక్ష్యం.
భారతదేశంలోని కార్మికుల హక్కుల కోసం ఎన్నో చట్టాలు తెచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మేడేను అంబేద్కర్ అంబేద్కర్ మేడే గా అంబేద్కర్ వాదులంతా జరుపుకోవాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూప్ కోరుతుంది.
