మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మందమర్రి ఏరియాలోని మైనింగ్ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో నిరసన.


 మందమర్రి ఏరియాలోని

మైనింగ్  సిబ్బంది

నల్లబ్యాడ్జీలతో నిరసన.


Scv News Kasipet :--

 సింగరేణి వ్యాప్తంగా మైనింగ్ సిబ్బంది ఐక్యవేదిక పిలుపుమేరకు బొగ్గు గనుల లో  మైనింగ్ సిబ్బంది శనివారం నల్లబ్యాడ్జీ లు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ  విధులకు హాజరయ్యారు. మందమర్రి ఏరియా ఐక్యవేదిక నాయకులు సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో  కాసిపేట -2 గని మైనింగ్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ  సింగరేణి బొగ్గు గనులలో విధులు నిర్వర్తించే మైనింగ్ సిబ్బంది వివిధ అనారోగ్య కారణాల వల్ల పనులు చేయలేని పరిస్థితుల్లో హాస్పటల్లో అన్ఫిట్ అయితే వారికి సూటబుల్ జాబు లు ఇవ్వాల్సి ఉండగా యాజమాన్యం ఇవ్వడంలేదని అన్నారు. .హాస్పటల్లో అన్ఫిట్ అయి పనులు చేయలేని మైనింగ్ సిబ్బందిని గ్రేడు  తగ్గించి మొదటి కేటగిరీలో పనులు ఇవ్వడం దారుణమని అన్నారు. ఈ విషయమై డైనింగ్ సంబంధించి ఎన్నో ఆందోళనలు ఉద్యమాలు చేశామని యాజమాన్యం పట్టించుకోవడంలేదని అన్నారు.

సింగరేణి లోని కార్మిక సంఘాలతో  ఈనెల 19న హైదరాబాదులో రీజినల్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగే చర్చలలో మైనింగ్ సంబంధి అన్ఫిట్ విషయమై మాట్లాడాలని కార్మిక సంఘాల నాయకులను కోరారు. గతంలో మాదిరిగానే ఆరోగ్యం వల్ల అన్ ఫిట్ అయిన మైనింగ్ సిబ్బందికి గ్రేడ్ తగ్గించకుండా అదే కేటగిరీలో ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాసిపేట మైనింగ్ సిబ్బంది ఓవర్ మేన్లు  కార్తీక్, సతీష్, చారి, సినియర్ మైనింగ్ సర్దార్ లు పల్లె  మల్లయ్య, పిల్లి వెంకటేశ్వర్లు, సుధాకర్, వెంకటరమణ, మహేష్, కుమార్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.అనంతరం కాసిపేట గని  మేనేజర్ రవీందర్ కు చంద్ర బోస్  ఆధ్వర్యంలో మైనింగ్ సిబ్బంది మెమోరాండం సమర్పించారు.