కాసిపేట 2 గనిలో ఈ ఎన్ టి యు సి బాయ్ బాట .
Scv News Kasipet :--
మందమర్రి ఏరియా కాసిపేట 2 గని ఆవరణలో శుక్రవారం ఐ ఎన్ టి సి జనరల్ సెక్రెటరీ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు బాయ్ బాట కార్యక్రమాన్ని మందమరి ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య నిర్వహించారు. కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. గనిలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను కార్మికులు ఐఎన్టీయూసీ నాయకుల దృష్టికి తీసుకు వచ్చారు. ప్రధాన సమస్య ఉపరితలంలోని బ్యాంకట్ మీద నిడ లేక అక్కడ పని చేస్తున్న ట్రామర్ కార్మికులు ఎండకు తట్టుకోలేక పోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. దేవి భూమయ్య స్పందిస్తూ యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూస్తాం ఆని కార్మికులకు హామీ ఇచ్చాడు. అనంతరం కార్మికులందరిని కలిసి రాబోవు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో జనక్ ప్రసాద్ గారి నాయకత్వం లోని ఐ ఎన్ టి యు సి యూనియన్ ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం ఎన్ టి యు సి ఏరియా సెక్రెటరీ చంద్రశేఖర్ దోరిశేట్టి, సహాయక కార్యదర్శి కారుకురీ తిరుపతి కాసిపెట2 గని పిట్ సెక్రెటరీ కొప్పుల బాపు, రాజేష్, సుభాష్, వెంకట స్వామి,కిరణ్ కుమార్, తోంగల కుమార్, శ్రీకాంత్, ఎల్లయ్య, వెంకట స్వామి ఇతర నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

