పెద్దనపల్లి పంచాయతీ
న్యూ కాలనీ లో
ఉచిత కంటి వైద్య పరీక్షలు.
Scv News Kasipet :--
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ కార్యాల యంలో శనివారం సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ వైద్య పరీక్షలు డాక్టర్ అంజయ్య గారు చేయడం జరిగింది ఇందులో గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన వారు మరియు ప్రక్క గ్రామాల వారు కూడా పాల్గొని పరిక్షలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ ఈ మానవ జీవితంలో అత్యంత కీలకమైన శరీరంలో ముఖ్యమైన భాగం కండ్లు అని అవి చాలా సున్నితమై నవి కాబట్టి కండ్లు మంచిగా ఉంచుకోవాలాన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల వల్ల బయట ఖరీదైన వైద్యం చేయించు కోలేక అట్లానే ఉండడంతో నేత్రాలు పొరలు వచ్చి సరిగా కనబడక నాన ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంచాయతీ పరిధిలోని వారిని గుర్తించి ఈ రోజు 93 మందికి పరిక్షలు చేయగా 14 మందికి ఆపరేషన్ అవసరం కాగా వీరికి త్వరలో ఉచితంగా చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం అధ్యక్షుడు దూడం మహేష్, కార్యదర్శి నస్పూరి నర్సింగ్, ఉపాధ్యక్షుడు సిద్ధం తిరుపతి,వార్డు సభ్యులు కొత్త రమేష్,పంబాల తిరుపతి, బన్న హిదుమతి, కంచర్ల పద్మ,, గ్రామ పెద్దలు గాదం గట్టయ్య, సోమని రాజం, పొట్టబత్తుల సంపత్, భూనేని రాజు,గడ్డం శ్రీనివాస్,లు పాల్గొన్నారు.

