మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ధ్యాన మార్గమే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెలుతుంది

 ధ్యాన మార్గమే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెలుతుంది.

- పులాజి బాబా ముఖ్య సంస్థాన్ పాట్నాపూర్ గౌరవాధ్యక్షులు కేశవ్ ఇంగ్లే 






Scv News Kasipet 

కాసిపేట మండలం గట్రావుపల్లి పంచాయతీ పరిధిలోని ఇప్పల గూడెంలో  గురువారం పూలజీ బాబా ద్యాన కేంద్ర 11వ వార్షికోత్సవ  కార్యక్రమానికి కేశవ్ ఇంగ్లే ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ధ్యానంతో మనసు నిగ్రహం తో పాటు ఆత్మశుద్ది జరుగుతుందని అన్నారు. మనిషి ఎప్పుడూ మంచినే కోరుకోవాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మహాత్ముల బోధనలను తెలుసుకుని ఆచరించాలి అన్నారు.

కేసుల గూడ ధ్యాన కేంద్ర అధ్యక్షుడు ఆత్రం భగవంతరావు మాట్లాడుతూ పరమహంస పులాజిబాబా బోధనలన్నీ భక్తులు తెలుసుకొని ఆచరించి నప్పుడు కుటుంబాలు ఆనందంగా ఉంటాయ న్నారు. మనిషి ఆనందంగా జీవించడానికి ధ్యానమే ఉత్తమ మార్గమని అన్నారు.

నిర్మల్ పులాజిబాబా ధ్యాన కేంద్ర అధ్యక్షురాలు   గండ్రత్ కమల ఈశ్వర్ మాట్లాడుతూ  మనుషుల్లో దయ,క్షమ,శాంతి ఉంటే ఎక్కడైనా శాంతి ఉంటుందన్నారు. పూలజీ బాబా దేశవ్యాప్తంగా 250 ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేసి ధ్యాన ప్రచారం చేశారని అన్నారు.  మన లోపల దాగి ఉన్న ఆత్మ స్వరూపులు బయటికి తీయాలంటే ధ్యానమార్గం శరణ్యం అన్నారు.

సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో పులాజిబాబా ధ్యాన కేంద్రాల వల్ల గిరిజనుల్లో ఎంతో మానసిక పరివర్తన జరిగి అభివృద్ధి పథం వైపు పయనిస్తున్నారు అన్నారు. ధ్యానమంటే నే  జ్ఞానమని అందరూ జ్ఞానం చేసి జ్ఞానవంతులు కావాలని అన్నారు.

సా చై వై ప్రధాన కార్యదర్శి  కొమ్ముల బాపు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవని పులాజి బాబా మానవులను సంస్కరించడానికి ధ్యాన కేంద్రాలు పెట్టాడని అన్నారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు పులాజి బాబా ఎంతో కృషి చేశాడు అన్నారు. పులాజిబాబా అడుగుజాడల్లో నడుస్తూ మంచినీ ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు మనమందరం ప్రయత్నం చేయాలని అన్నారు.

 సా చై వే ముఖ్య సలహాదారులు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ  తెలంగాణ పల్లెల్లో  అడవులలో అజ్ఞానంలో ఉన్న గిరిజనులను జ్ఞాన వంతులను చేసేందుకు పులాజి బాబా ధ్యాన కేంద్రాన్ని నెలకొల్పడం ఆనందదాయకమని అన్నారు.  ధ్యాన కేంద్రాల వల్ల గిరిజనుల్లో ఎంతో మార్పు వచ్చి చైతన్యవంతులు అవుతున్నారు అని కొనియాడారు. దాన కేంద్రాలను మరిన్ని గ్రామాల లోకి విస్తరించాలని కోరారు. ఈ సమావేశానికి ఇప్పల కూడా ధ్యాన కేంద్ర అధ్యక్షులు పంద్రం  రాజు అధ్యక్షత వహించాడు.

 ఇప్పల గూడా ధ్యాన కేంద్ర 11వ వార్షికోత్సవం సందర్భంగా బధవారం నుండి ధ్యాన  కేంద్ర పరిధిలోని గ్రామాలలోని ధ్యానులు, గిన్నె దారి తిర్యాని గ్రామాల నుండి  భజన బృందాలు వచ్చి రాత్రంతా భజనలు చేశారు. ధ్యాన ధారణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  సమావేశం ప్రార్థనతో ముగించారు.