మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళు లు .

 ఇంద్రవెల్లి అమరవీరులకు

నివాళు లు .





Scv News Kasipet :--

కాసిపేట మండల కేంద్రంలోని దేవాపూర్ పంచాయతీ పరిధి లో గల నాయకపు గూడలో ఆదివాసి సేవా నాయకపోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో భూమి భుక్తి విముక్తి కోసం పోరాడిన ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల్లో అసువులు బాసిన ఆదివాసి అమరులకు బుధవారం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వడ్డీ వ్యాపారస్తుల దోపిడీకి వ్యతిరేకంగా అడవి అధికారుల ఆగడాలు ఆపాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజన రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి లో 1981 ఏప్రిల్  20 న  బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభను ఎలాగైనా ఆపాలని ప్రభుత్వం పోలీస్ ప్రజలపై దాడులు చేసి రెచ్చగొట్టి విచ్చలవిడిగా కాల్పులు జరిపి అనేకమంది ఆదివాసి ప్రజలను పొట్టన పెట్టుకుంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి ఆదివాసి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి  ఆదివాసి బంధు పథకం అమలు చేయాలని ఆదివాసి నాయకుడు రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు డిమాండ్ చేశారు. మహిళా సంఘం నాయకురాలు శైలజ, ఎస్ ఎఫ్ ఐ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి కొమ్ముల రజిత, మేకల సునీల్, కొమ్ముల సంజీవ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.