మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బన్న ఆశన్న ఉద్యమ జీవితం గురించి..

 





కాసిపేట బాలుర సాంఘిక సంక్షేమ  గురుకుల పాఠశాల తరలింపుకు నిరసనగా నిరాహార దీక్ష.

Scv News Kasipet :--

కాసిపేట మండల బహుజన నాయకుడీగా బన్న ఆశన్న గత అర్థ శతాబ్దంకు పైగా ప్రజా సమస్యలపై, ప్రజలకు అండగా ముందుండి పోరాటం చేస్తూనే ఉన్నాడు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కొరకు తన ప్రాణాల ను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కాసిపేట, ముత్యంపల్లి, చిన్న ధర్మారం గ్రామాలను బొందల గడ్డగా మార్చేందుకు సింగరేణి యాజమాన్యం తలపెట్టిన కాసిపేట ఉపరితలగనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. పోలీస్ మైత్రి నాయకుడిగా మహిళా సంఘాలతో  గుడుంబా సారాకు వ్యతిరేకంగా ఉద్యమించారు.కాసిపేట మండలానికి  మంజూరైన సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాల తరలింపు వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇలా తన జీవితం మొత్తం ప్రజల కోసం ఉద్యమిస్తూనే ఉన్న బహుజన ఉద్యమ నాయకుడు బన్న ఆశన్న జీవిత చరిత్రను చదవండి...

 *పోలీస్ మైత్రి నాయకుడిగా గుడుంబ వ్యతిరేక పోరాటం.

 కాసిపేట సర్పంచిగా పంచాయతీ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూనే  పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన పోలీస్ - మైత్రి  కమిటీ నాయకుడిగా  బన్న ఆశాలు పనిచేశాడు . అప్పటి మందమర్రి  సిఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో గుడుంబా తయారీని మహిళా సంఘాలతో అడ్డుకున్నారు. చిన్నచిన్న సమస్యలతో కుటుంబ కల హాలతో ఎన్నో జంటలు విడాకులు తీసుకునేవి. కుటుంబాల కౌన్సిలింగ్ కమిటీలో సభ్యుడిగా బన్న ఆశాలును చేర్చుకున్నారు. కౌన్సిలింగ్ ద్వారా వివా హ జంటల మధ్యలో ఉన్న గొడవలను పరిష్కరించి సుమారు 200 జంటలను కలిపారు. దీనికి గాను సిఐ తాజుద్దీన్ కు  అంతర్జాతీయ అవార్డు కూడా లభించింది.

 *కాసిపేట ఉపరితల గని కి వ్యతిరేకంగా పోరాటం.

 కాసిపేట మండల కేంద్రం ఉనికికే ప్రమాదంగా పరిణమించిన కాసిపేట ఉపరితలగనికి  వ్యతిరేకంగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో బన్న ఆశన్న ప్రజా ఉద్యమాన్ని నిర్మించాడు. కాసిపేట, ముత్యంపల్లి,చిన్న ధర్మారం,మామిడి  గూడెం,గోండుగూడెం గ్రామాలను బొందల గడ్డగా మార్చేందుకు సింగరేణి యాజమాన్యం తలపెట్టిన కాసిపేట  ఉపరితల గని ఏర్పాటును అడ్డు కున్నారు. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోసం కాలుష్య నియంత్రణ మండలితో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో తమ గ్రామాలను బొందలగడ్డగా మార్చే ఓపెన్ కాస్ట్ ను  వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అప్పటికే కాసిపేట గని తవ్వకాల వల్ల కాసిపేట, ముత్యంపల్లి గ్రామాల ప్రజలు తాగునీటికి తల్లడిల్లుతున్నారని అధికారుల దృష్టికి తెచ్చారు. అఖిలపక్ష కమిటీ ఆందోళనల ఫలితంగా సింగరేణి యాజమాన్యం కాసిపేట ఓపెన్ కాస్ట్ ఏర్పాటు ను విరమించుకుంది.

* ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర.

- మండలంలో మూడు రోజులు,124  కిలోమీటర్ల పాదయాత్ర. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలో బన్న అశన్న గ్రామ గ్రామాన ఉద్యమ విస్తరణ కోసం క్రియాశీల పాత్ర పోషించాడు. రాస్తా రోకోలు, వంటా-వార్పు, సహపంక్తి భోజనం పాదయాత్ర లాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిం చారు. తెలంగాణ ఉద్యమాన్ని బలంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించెందుకు మండలంలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో మండల ఐక్యకార్యా చరణ కమిటీ ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారు. మండల ఐక్య కార్యాచరణ కమిటీ కో కన్వీనర్ గా పనిచేస్తూ మండల ప్రజలను ఉద్యమంలోకి సమీకరించేం దుకు మండలంలోని గ్రామాల గుండా ప్రజా సంఘాలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.సోమగూడెం నుండి  సోనాపూర్ వరకు వివిధ గ్రామాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ  3 రోజులు 124 కిలోమీటర్ల దూరం  పాదయాత్ర నిర్వహించారు.

 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరణ నిరాహార దీక్ష .



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం గ్రామగ్రామాన విస్తరించి ప్రజలందరూ పాల్గొనడంతో  తీవ్రరూపం దాల్చింది. మండల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు మండల కేంద్రంలో అమరణ నిరాహార దీక్షలు ప్రారంభం అయ్యా యి. కాసిపేట మండల కార్యాలయం ముందు ధర్మరావు పేట గ్రామానికి చెందిన బత్తుల మధు 2010 జనవరిలో అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మూడు రోజుల్లోనే పోలీసులు  బత్తుల మధు అమరణ దీక్షను భగ్నం చేసారు. వెంటనే  బన్న ఆశాలు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 10 జనవరి 2010న అమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఏడు రోజులు నిరాహార దీక్ష చేసి నీరసించి పోయారు. ఆరోగ్యం క్షీణించడంతో 30 జనవరి 2010 లో పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆశన్నను ఆస్పత్రికి తరలించారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమాలు చేసినా తెలంగాణ ఉద్యమకారుడు బన్న ఆశన్న.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ద్రోహులకు తప్ప తనలాంటి ఉద్యమ కారులకు గుర్తింపు లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 *సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తరలింపుకు నిరసనగా నిరాహారదీక్ష.

కాసిపేట మండలానికి 2016 -17 లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మంజూరైంది.తరగతులు ప్రారంభించేం దుకు మండలంలోని రేగుల గూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు కూర్చునేందుకు అవసరమైన సామగ్రి తెచ్చారు. ఈలోగా గురుకుల పాఠశాలను నెన్నెలా మండలానికి  తరలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆశ్రమ పాఠశాలకు వచ్చిన సామాగ్రిని తరలించుకు పోయారు. గురుకుల పాఠశాల తరలింపుకు నిరసనగా మండల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యాలయం ముందు  రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడంలో బన్న ఆశాలు  క్రియాశీల పాత్ర పోషించారు. ఐదు రోజుల రిలే నిరాహారదీక్షకు ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్సీ పురాణం సతీష్ చే  గురుకుల పాఠశాలను తరలించడం లేదని హామీ పత్రం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఇలా బన్న ఆశన్న ఆధ్వర్యంలో జరిగిన పోరాట ఫలితంగా కాసిపేట మండలానికి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల దక్కింది. ఇలా తన సుధీర్ఘ 60 ఏళ్ల రాజకీయ అనుభవంతో  మండల  బహుజన ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. ఇదీ .. అలుపెరుగని బహుజన  పోరాట యోధుడు బన్న ఆశన్న ఉద్యమ జీవిత చరిత్ర ...

( రేపు ప్రజల కోసం నిస్వార్ధంగా, నిజాయితీగా పని చేస్తున  బన్న ఆశన్న పై ప్రజా వ్యతిరేకులైన పెత్తందార్లు, కిరాయి గుండాలు చేసిన దాడులు, హత్య ప్రయత్నాల గురించి ..)