మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ప్రజా నాయకుడు బన్న ఆశన్న పై జరిగిన దాడులు.

 





Scv News Kasipet :--

 కాసిపేట పంచాయతీలో బన్న ఆశ న్న సర్పంచ్ గా బహుజన ప్రజల కోసం పరితపిస్తూ గ్రామాలను అభివృద్ధి చేయడం సహజంగానే స్థానిక  అగ్రకుల పెత్తందారులు జీర్ణించు కోలేకపోయారు. తాను చేసిన అభివృద్ధి పనులతో మండల స్థాయి రాజకీయాల్లో కూడా బన్న ఆశన్న మంచి పేరు తెచ్చుకున్నాడు.  మండలంలో దొరలకు దీటుగా  బహుజనుల కోసం పనిచేసే  నాయకుడిగా ఎదిగాడు. కాసిపేట పంచాయతీ లో జరిగిన అభివృద్ధి పనులు మా గ్రామాలలో ఎందుకు జరగడం లేదని ప్రజలు అగ్రకుల పెత్తందార్లు లైన  అప్పటి గ్రామ సర్పంచులను నిలదీసే స్థాయికి ఎదిగారు. ఇది సహించలేని పెత్తందార్లు బన్న ఆశ న్నను ఎదగనివ్వకుండా అంత మొందించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. రాజకీయంగా ప్రతి విషయం పై వివాదాలు లేవదీసి అవమానించడం, ప్రారంభించారు. కిరాయి మూకలతో భౌతిక దాడులు,హత్యాయత్నానికి ప్రయత్నించారు.

చరిత్రను ఒకసారి పరిశీలిస్తే  ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని, వారి చైతన్యం కోసం అభివృద్ధి కోసం  ప్రయత్నించే ఏ నాయకున్ని పాలకవర్గాలు, అగ్రవర్ణ పెత్తందార్లు వదిలి పెట్టలేదు. ప్రజలు చైతన్య వంతమైతే తమ దోపిడీ పాలన సాగదని  గ్రహించి ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నో చిత్ర హింసలు పెట్టి,బహిరంగంగా ప్రజల సమక్షంలో ఆ వర్గ ప్రజలతోనే చంపించిన సందర్భాలు బానిస తిరుగుబాటు నాయకుడు స్పార్టకస్, జీసస్ క్రైస్ట్ నుండి నేటికి కొనసాగుతూనే ఉన్నాయి.బహుజన ప్రజా నాయకుడు బన్న అసలు పై కూడా అదే రకమైన దాడులు జరిగాయి.

ప్రజల కోసం పని చేసే వారిపై వారి వర్గ ప్రజల తోటే దాడులు చేయిస్తారు.

బహుజన వర్గాల చైతన్యం, వారి అభివృద్ధి కోసం పని చేసే నాయకులపై అదే వర్గాలకు  చెందిన కొంతమందిని చేరదీసి అగ్రకుల పెత్తందార్లు, దొరలు వెనక ఉండి దాడులు చేయించడం వారికి ఆనవాయితి. బహుజన వర్గాలలోని ఎస్సీ ఎస్టీ బీసీ లోని కొందరు బాగా మాట్లాడే వారిని, రౌడీయిజం చేసేవారిని చేరదీసి  ప్రలోభాలకు గురిచేసి , తమ గడిలలో  మందు, విందు, పార్టీలకు అలవాటు చేసి వారి  అనుచరులుగా మార్చుకుంటారు. వారికి గిట్టనివారు ప్రజల కోసం పనిచేసే బహుజన వర్గాలకు చెందిన నాయకులపై  తాను పెంచి పోషించిన రౌడీ మూకలతో గ్రామాలలో  దుష్ప్రచారం చేయిస్తూ, దాడులు చేయించడం అగ్రకుల  పెత్తందార్లు దొరల సహజ లక్షణం. బహుజన నాయకుడు ఆశన్న కూడా అలాంటి వారిచె దాడులకు గురయ్యాడు.

బన్న ఆశన్న పై అతని బంధువుల పై జరిగిన దాడులు...

బన్న ఆశన్న సర్పంచిగా ఉన్న హయాంలో  1986లో తన తమ్ముడు బన్న ఎల్లయ్య, అతని అల్లుడు నక్క రాయలింగు లు మామిడి గూడెం గ్రామానికి వెళ్లి వస్తు అనుమానాస్పద స్థితిలో బావిలో పడి మృతి  చెందారు . ఇది పక్కా హత్యే అని కుటుంబ సభ్యులు నెత్తి నోరు కొట్టుకుని గొడవ చేసిన పోలీసులు పట్టించుకోకుండా విచారణ కూడా సరిగా చేయకుండా ఆత్మ హత్యగా చిత్రీకరించారు. దీనిపై  కుటుంబ సభ్యులు,బన్న ఆశన్న పోలీసు ఉన్నతాధికారు లకు విచారణ జరపాలని  ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ వారి మృతికి కారణాలు తెలవకుండా  మిస్టరీగానే మిగిలాయి.

* అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మండల కాంగ్రెస్ నాయకుడిగా సర్పంచిగా ప్రజల కోసం ఏదైనా సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన, మండల సమావేశాలలో ప్రస్తావించిన పట్టించుకునే వారు కాదు. సమస్యలపై నిలదీసిన సందర్భాల్లో మండల పరిషత్  ఉపాధ్యక్ష పదవి ఎన్నికల సమయాల్లో ప్రశ్నించినందుకు భౌతిక దాడులకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.

 నకిలీ నక్సలైట్ల తో  హత్యాయత్నం.

 ప్రజా నాయకుడైన బన్న ఆశన్న ను  అంత మొందించేందుకు అగ్రకుల పెత్తందర్లు నకిలీ నక్సలైట్ ముఠాతో 25 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 6 జూన్ 1990 లో సోమగూడెం పాతబస్తీకి చెందిన అయితే బాపు అనే నకిలీ నక్సలైట్ ముఠా రాత్రి బన్న ఆశాలు ఇంటిపై దాడి చేసి అతన్ని అతని కొడుకు బాపును గ్రామ శివారు వరకు ఎత్తుకెళ్లి తీవ్రంగా కొట్టారు. ఆశన్న రెండు కాళ్ళు విరగ్గొట్టారు. కాళ్లకు చేతులకు తీవ్ర గాయాలు చేసారు. అతని కొడుకు బాపును తీవ్రంగా కొట్టి తలపై గాయ పరచడంతో స్పృహ తప్పి పడిపోయాడు. చనిపోయారు అనుకుని వెళ్లిపోయారు. ఈ దాడులు ఎందుకు చేశారు?ఎవరు చేయించారు?అని అందరికీ తెలుసు. దాడులకు పాల్పడే వారిని పోలీసులు పట్టుకున్న సందర్భాల్లో ఈ వివరాలన్నీ  తెలిసినవి. అయినా చర్యలు లేవు.

 ఇది.. కాసిపేట మండల బహుజన పోరాటయోధుడు బన్న  ఆశన్న జీవిత చరిత్ర....

  ఆశన్న ప్రజా నాయకుడిగా ప్రజల కోసం పని చేస్తే సహించని వారు, అతని  ఎదుగుదలను ఓర్వలేక ఎన్నో రకాలుగా  అవమానించి, దాడులు చేయించిన వారు చరిత్ర  హీనులుగా మిగిలి పోయి  కాలగర్భంలో కలిసిపోయారు. నిరంతరం ప్రజల కోసం అహర్నిశలు కృషిచేసిన బన్న అశన్న మాత్రం  మండల బహుజన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయాడు. ఇదే నిజాయితీ పరులకు, అవినీతి పరులకు వున్నా తేడా..