అంబేద్కర్ విగ్రహం దహనం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి.
- అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్.
Scv news Kasipet :--
జోగులాంబ జిల్లా కొర్విచేడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కాసిపేట అంబేద్కర్ యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాసిపేట మండల కేంద్రం లో అంబేద్కర్ యువజన సంఘ సమావేశంలో విగ్రహం దహనం పై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు రామచందర్ మాట్లాడుతూ బహుజన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం బాధాకరమని అన్నారు. ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిసెల బాపు మాట్లాడుతూ వాస్తవం లో అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కరువైందని ప్రభుత్వం విగ్రహాల ధ్వంసం చేసిన వారిని వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ను అవమానించేలా విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణం అని అన్నారు. నిరసన కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి వడ్లూరు మల్లేష్, ఉపాధ్యక్షుడు రామిళ్ళ కిష్టయ్య, సంయుక్త కార్యదర్శి గొడిసెల సురేందర్, దాసరి శంకర్ ముఖ్య సలహాదారులు పల్లె మల్లయ్య, దాసరి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

