Scv News Kasipet :-- బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి కార్యక్రమాలు కాసిపేట మండలంలో వివిధ గ్రామాల్లో ఘనంగా జరిగాయి. దేవాపూర్ గ్రామంలో మండల, గ్రామ అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం వైభవంగా జరిగింది. గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున అంబేద్కర్ చిత్రపటాల తో సుమారు గ్రామం లోని వివిధ వీధుల గుండా రెండు కిలోమీటర్లు ఊరేగింపు నిర్వహించారు. తదనంతరం అంబేద్కర్ భవన్ వద్ద మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జాడి రాంచందర్ జెండాను ఆవిష్కరించారు అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ రోడ్డలక్ష్మి, ఎం పి టి సి మెరుగు పద్మ గజమాలను సమర్పించారు. సమావేశంలో ముఖ్య అతిధులుగా హాజరైన డాక్టర్ సులోకనాథ్ మాట్లాడుతూ
అంబేద్కర్ ప్రబోధించిన మూడు సూత్రాలు సమీకరించు, బోధించు, పోరాడు అంబేద్కర్ వాదులు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. అంబేద్కర్ ఈ దేశ బహుజనుల అభ్యున్నతి కోసం జీవితాన్ని కుటుంబాన్ని సర్వస్వం త్యాగం చేశాడని అన్నారు. ఆ మహనీయుడి త్యాగం వల్లనే మనం ఈరోజు సుఖంగా బ్రతుకుతున్నాము అని అన్నారు.
అంబేద్కర్ వాది బుద్దిస్ట్ ప్రచారకుడు తోటపల్లి భూమన్న మాట్లాడుతూ అంబేద్కర్ జ్ఞానం పెంచుకునేందుకు వేలాది పుస్తకాలు చదివాడని అన్నారు. చరిత్ర తెలియకుంటే చరిత్రను నిర్మించలేము అని గత చరిత్ర అంతా చదివాడని అన్నారు. పుస్తకాలు పెట్టుకునేందుకు పెద్ద గృహాన్ని నిర్మించాడని దానికి 'రాజా గృహ 'అని పేరు పెట్టారని అన్నారు. ఈ దేశ మూలవాసులైన ద్రావిడులను, దక్షిణాసియా నుండి వచ్చిన ఆర్యులు ఓడించిన విధానాన్ని వివరించాడు. మౌర్య సామ్రాజ్య పతనానంతరం జరిగిన పరిణామాలను వివరించారు. బౌద్ధమత ప్రబోధాలు గురించి అంబేద్కర్ చివరి నిమిషంలో బౌద్ధాన్ని స్వీకరించి విదేశ బహుజనుల అంతా బౌద్ధ సంస్కృతి లోకి ఎందుకు రావాలనే విషయాన్ని వివరించారు. బహుజనులు అంత ఐకమత్యంతో, సుఖశాంతులతో జీవించాలంటే బౌద్ధమే శరణ్యమని అన్నారు. బౌద్ధ ప్రార్థన లోని 'బుద్ధం శరణం గచ్చామి ' మూడు సూత్రాల గురించి వివరించారు.
ఓరియంట్ చార్జి హెచ్ ఆర్ డి జిఎం ఆనంద్ కులకర్ణి మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ జయంతి కార్యక్రమం దేవాపూర్ వాసులు ఘనంగా జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. ప్రజలంతా అంబేద్కర్ వాదాన్ని తెలుసుకుని పాటించాలని అన్నా రు. బౌధ్ధ సంస్కృతిని పాటించి అహింసా పద్ధతిలో జీవించాలని సూచించారు. కార్యక్రమం లో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, ఎంపీటీసీ మెరుపు పద్మ, దేవాపూర్ ,మద్ది మడ సర్పంచులు అనంత రావు ఆడే జంగు, మాజీ జెడ్పిటిసి రౌత్ సత్తయ్య, దేవాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు గసి కంటి మల్లేష్ మాట్లాడారు . ఈ సమావేశా నికి మండల ప్రధాన కార్యదర్శి వడ్లూరు మల్లేష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జి బన్న లక్ష్మణ్ దాస్, గౌరవాధ్యక్షుడు జాడి
పోషమ్, ముఖ్య సలహాదారు పల్లె మల్లయ్య, దాసరి రాజన్న, దాగం మల్లేష్, లంక లక్ష్మణ్ ఉపాధ్యక్షులు కొమ్ముల బాపు , రామిళ్ళ కిష్టయ్య, కార్యదర్శి janjirala తిరుపతి, మెయిన్ డ్రాప్ రాజన్న, గ్రామ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట మండల కేంద్రంలో....
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మండల శాఖ అధ్యక్షుడు రామచందర్, ఇంచార్జ్ బన్న లక్ష్మణ్ దాస్, సీనియర్ బహుజన నాయకుడు బన్న ఆశాలు, లంక లక్ష్మన్, పూలమాలలు వేశారు.
టిఆర్ఎస్ ఆధ్వర్యంలో...
కాసిపేట మండలం లో మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో పరిషత్ ఉపాధ్యక్షులు విక్రమ్ రావు, ముత్యం పల్లి సర్పంచ్ ఆడే బాదు, కాసిపేట ఎంపిటిసి లక్ష్మి, పొలం గూడెం ఎంపీటీసీ నవనందుల చంద్రమౌళి, ఉప సర్పంచి బోయిన తిరుపతి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాసుదేవ్, కోఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్, మాజీ జెడ్పిటిసి ఆర్.సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో...
కాసిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో కాసిపేట ముత్యం పెళ్లి గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు.