నేడు
బాబాసాహెబ్ అంబేద్కర్ 131 జయంతి.
ప్రపంచంలోని అత్యధిక సహజ వనరులు, సారవంతమైన భూమి, జీవనదులు ఉన్న భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏమిటి?
* దేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పేదరికంలో ఉండడానికి కారణం ఏమిటి?
వీటన్నిటికీ సమాధానం దేశంలో బ్రాహ్మణీయ భావజాలం తో ఉన్న ప్రభుత్వాలు ప్రపంచ మేధావి బాబా సాహెబ్ అంబేద్కర్ సలహాలు, సూచనలు పాటించక పోవడమే ప్రధాన కారణమని ప్రపంచ మేధావి వర్గం తేల్చిచెప్పింది.
బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి సందర్భంగా వాటి గురించి తెలుసుకుందాం!
Scv News Kasipet :--
ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో లక్షలాది ఎకరాల సారవంతమైన భూములు, నిత్యం ప్రవహించే జీవనదులు, అపారమైన సహజ వనరులు, ఖనిజ సంపదలు ఉన్నా స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు అభివృద్ధి చెందడంలేదు అన్న ప్రశ్న ప్రపంచ మేధావులను తొలిచి వేస్తుంది. నేటికీ దేశంలో 85% ఉన్న బహుజన వర్గాలకు సరైన విద్య, వైద్య,ఉపాధి అవకాశాలు లభించక విదేశాలకు ఉపాధి కోసం ఎందుకు వలస వెళ్తున్నారు.? గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు పట్టణాలకు వలసలు రావడానికి గల కారణాలు ఏమిటి?
ప్రపంచంలో భారతదేశం కంటే వెనక బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్ర్యం సాధించి అభివృద్ధి పథంలో ఎన్నో దేశాలు దూసుకుపోతున్న భారతదేశం ఎందుకు అభివృద్ధి పథంలో నడవడం లేదు, దీనికి కారణాలేమిటి? అనే అంశాలపై విదేశా లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రపంచం ఐఐటిగా భావించే హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ అంశాలపై రెండు సంవత్సరాల సుదీర్ఘ డిబేట్ జరిగి తేల్చిన విషయం ఏమిటంటే ప్రపంచ మేధావిగా పేరుగాంచిన బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి ప్రధాని చేయకపోవడం,సలహా లు సూచనలను పట్టించుకోకపోవడం భారతదేశం పేదరికానికి ప్రధాన కారణమని తేల్చారు.
భారత దేశ ప్రజలు దేశ స్వాతంత్రం కోసం పోరాడినా ఫలితం బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం నుండి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. అధికారాన్ని మాత్రం15 శాతం వున్నా మనువాద బ్రాహ్మణ, బనియా,అగ్రకుల వర్గాలకు చెందిన భూస్వాములు,పారిశ్రామికవేత్తలు చేజిక్కించుకున్నారు. అధికారాన్ని వారి వర్గ స్వప్రయోజనాలకు వాడుకోవడం వల్ల దేశంలోని 85 శాతం ఉన్న బహుజన వర్గాలన్నీ అభివృద్ధి చెందక నేటికీ పేదరికంలోనే కొనసాగుతూన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బహుజనులు అభివృద్ధి చెందకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని స్వాతంత్రానికి ముందు, తర్వాత కరుడుగట్టిన మను వాదులతో రాజీలేని పోరాటం నిర్వహించాడు.ఈ దేశంలో మెజారిటీ వర్గాలైన బహుజనులను మనువాదలు మనుషులుగా కూడా గుర్తించని సమయంలో బ్రిటిష్ వారిని ఒప్పించి రౌండ్ టేబుల్ సమావేశంలో ఓటుహక్కును సంపాదించి పెట్టాడు. కమ్యునల్ అవార్డు ద్వారా బహుజనులకు రాజ్యాధికారం వచ్చే విధంగా బ్రిటిష్ వారి ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నాడు. బహుజనులు రాజ్యాధికారంలోకి రాకుండా గాంధీ కుట్ర చేసి ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల 'పూనా ఒప్పందం ' వల్ల కమ్యూనల్ అవార్డును కోల్పోయాం.దాని ఫలితంగానే నేటికి బహుజనవర్గం అధికారానికి దూరమై, అభివృద్ధి లేక పేదరికంలో ఉండడానికి ప్రధాన కారణం.
ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ వర్గాలు అధికారంలో ఉండి మైనారిటీ వర్గాలను పాలించడం. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో అమలు జరుగుతున్న తీరు. భారతదేశంలో మాత్రం 15 శాతం ఉన్న అగ్రవర్ణాల అయినా బ్రాహ్మణ,బనియా, ధనికులైన అతిశూద్ర వర్గాలే దేశంలో, రాష్ట్రాలలో అధికారంలోకి రాజ్యాధి కారాన్ని చేజిక్కించుకుని పాలించడం వల్ల 85 శాతం బహుజనులకు న్యాయం జరగడం లేదు. బహుజన వర్గాలు దోపిడీకి గురై ఆకలితో అలమటి స్తున్నాయి.
అపారమైన సహజ వనరులు భారత దేశం సొంతం.
ప్రపంచంలోనే అత్యధిక సాగు భూమి, నీటి వసతులు ఉన్నా దేశం భారతదేశం. సహజ వనరులు, ఖనిజ సంపదలలో అమెరికా తర్వాత భారత్ దే అగ్రస్థానం. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో 4వ స్థానం, ఐరన్ ఉత్పత్తిలో ఏడవ స్థానం, మైకా ఖనిజ సంపద లో 5వ స్థానంలో భారత్ ఉంది. ఆహార ఉత్పత్తులు సాధించడంలో కూడా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. భూమి,సహజ ఖనిజ సంపద లన్ని సరైన రీతిలో ఉపయోగించకుండా కొంత మంది భూస్వాములు, పారిశ్రామిక చేతుల్లో ఉండడంవల్ల బహుజన వర్గ ప్రజలకు న్యాయం జరగడంలేదు. గ్రామాలలో ప్రజలకు వ్యవసాయం చేసేందుకు భూములు లేక బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు.ఎలాంటి సహజ వనరులు లేని చుట్టూ సముద్రం ఉన్న దీవుల్లో గల్ఫ్ దేశాలకు దేశంలోని నిరుద్యోగ యువత వలసలు వెళ్లి బ్రతకాల్సిన పరిస్థితి రావడం మనకు సిగ్గుచేటు.
విశ్వ గురువు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే సకల సంపదలు ఉన్న భారతదేశాన్ని ఎలా అభివృద్ధి పథంలో నడపాలని స్వాతంత్య్రానికి ముందే పలు సూచనలు,సలహాలు ఇచ్చారు. వీటిని మనువాద బ్రాహ్మణ అగ్రవర్ణాలు పట్టించుకోలేదు. మహనీయుడు చేసిన సూచనలను, సలహాలను అగ్రకుల అహంకారంతో ఉన్న బ్రాహ్మణ మనువాద పార్టీ అయిన కాంగ్రెస్ పక్కనపెట్టి అవమానించారు. దేశం దారిద్ర్యంలో కి వెళ్లడానికి ప్రధాన కారణం ఇదే.
అంబేద్కర్ సూచించిన సలహాలు ఇవి...
బ్రిటిష్ వారి నుండి దేశానికి స్వాతంత్రం వచ్చేముందు దేశంలోని బహుజన వర్గాలను పేదరికం నుండి బయట పడవేసి భారతదేశం అభివృద్ధి పథంలో నడిపించేందుకు 1946 డిసెంబర్ 9 న రాజ్యాంగ సభకు బాబాసాహెబ్ అంబేద్కర్ మూడు సూచనలు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భూమి, పరిశ్రమలు, సహజ సంపదలన్నీ మన ప్రభుత్వం ఆధీనంలోకి వస్తాయి కాబట్టి 3 అంశాలను అమలు చేయాలని కోరారు.
1 దేశంలోని భూమి అంతా ప్రజలకు పంచాలి.
2, పరిశ్రమలన్నీ జాతీయం చేసుకొని ప్రభుత్వ ఆధీనంలో నడిపించాలి.
3, సహజ సంపదలను జాతీయం చేసుకోవాలి.
బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన ఈ మూడు అంశాలను భూస్వాముల పారిశ్రామికవేత్తల తొత్తులుగా మారిన గాంధీ,నెహ్రూ, పటేల్ ఒప్పుకోలేదు. మూడు అంశాలను రాజ్యాంగంలో చేర్చేందుకు నిరాకరించారు. దాని ఫలితంగానే ఈ రోజు భారతదేశం పేదరికంలో ఉండడానికి ప్రధాన కారణం.
అంబేద్కర్ సూచించిన విధంగా భూస్వా ములు,జాగీర్దార్ల వద్ద ఉన్న వేలాది ఎకరాల భూమిని గ్రామీణ ప్రాంతంలోని పేదలందరికీ పంచితే భూమి సాగులోకి వచ్చి ఆహార ఉత్పత్తులు పెరిగి దేశం ఎంతో అభివృద్ధి పథంలోకి వచ్చేది. బ్రతుకు తెరువు కోసం గ్రామీణ ప్రాంతంలో ని ప్రజలు పట్టణాలకు వలసలు వచ్చేది తగ్గేది. పరిశ్రమలను జాతీయం చేసుకొని ప్రభుత్వ ఆధీనంలో నడిస్తే అందరికీ ఉపాధి దొరికేది. దేశంలోని సహజ సంపద, ఖనిజ సంపదతో కర్మాగారలు ఏర్పాటు చేసి ఉత్పత్తులు తీస్తే ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారతదేశం నిలిచేది. మనువాద బ్రాహ్మణ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం భూస్వాము లకు,జాగీర్దార్లకు,టాటా బిర్లా లాంటి పారిశ్రామిక వేత్తల చేతుల్లో ఉండడం వల్ల భూమిని పరిశ్రమలను జాతీయం చేయలేకపోయింది. దీనివల్ల దేశం అభివృద్ధి చెందక పోవడంతో పాటు బహుజన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది.
ప్రపంచ మేధావి అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ తీవ్ర నిర్లక్ష్యం.
భారతదేశ స్వాతంత్రానికి ముందు, తర్వాత దేశంలోని అణ గారిన వర్గాలైన బహుజనులకు హక్కులు సాధించడంలో, దేశ పురోభివృద్ధికి అంబేద్కర్ ఎంతో కృషి చేశాడు. పరిపాలన ఎలా చేయాలి అని రాజ్యాంగాన్ని రాసి పెట్టాడు మహనీయు డు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీ యం.రిజర్వు బ్యాంక్ ఏర్పాటు, నదీ జలాల పంపిణీ నదులపై ఆనకట్టలు, ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, కార్మికులకు మహిళలకు ఎన్నో హక్కులు సాధించిపెట్టిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ ది. దేశానికి చేసిన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించకుండా తీవ్రంగా నిర్లక్ష్యం వహించింది.
చనిపోయిన 34 ఏళ్ల కు 'భారతరత్న 'అవార్డు.
బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన ప్రజల కోసం పోరాడడం మనువాద బ్రాహ్మణ కాంగ్రెస్ నాయకులకు అసలు నచ్చలేదు. రాజ్యాంగాన్ని రాయకుండా, రాజ్యాంగ సభకు ఎన్నిక కాకుండా ఎన్నో కుట్రలు చేసి ఓడించారు. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా అంబేద్కర్ ఎన్నో రకాల వేధింపులకు అవమానాలకు గురి చేశారు. భారతదేశ చరిత్రలో బహుజనుల కోసం పోరాడిన పోరాట యోధుల చరిత్రలను ఎలా కనుమరుగు చేశారో కాంగ్రెస్ నాయకులు కూడా అలానే చేశారు. అంబేద్కర్ చరిత్రను కూడా ముందు తరాలకు తెలవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసి అతని ప్రాముఖ్యతను తగ్గించే కుట్రలకు తెరతీశారు. దేశ స్వాతంత్రం అనంతరం గాంధీ,నెహ్రూ, ఇతర జాతీయ నాయకులకు భారతదేశంలో అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డు ఇచ్చి గౌరవించాయి. దేశానికి ఎలాంటి సేవ చేయలేని వారికి, సినీ నటులకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న అవార్డ్ ఇచ్చి గౌరవించాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ అనగారిన ప్రజలకోసం, దేశం కోసం జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేసిన కూడా బ్రతికున్నంత వరకు భారతరత్న అవార్డు ఇవ్వకుండా అవమానించాయి.అంబేద్కర్ చనిపోయిన 34 సంవత్సరాలకి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వి.పి.సింగ్ ప్రభు త్వం గుర్తించి 1990లో బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాయి. అప్పటి నుండి బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం గురించి బహుజనులకు తెలిసింది.అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన విద్య,ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల వల్ల బహుజనులకు పదవులు లభించడంతో అంబేద్కర్ మా నాయకుడు అనే స్పృహ ఇప్పుడిప్పుడే బహుజన వర్గాలు లోకి వస్తుంది.
బహుజన రాజ్యస్థాపన తోనే దేశంలోని మెజారిటీ వర్గాలైన బహుజనులకు న్యాయం.
భారత దేశంలోని 85 శాతం ఉన్న బహుజనుల అందరికీ విద్య, ఉద్యోగ, ఉపాధి లభించి అభివృద్ధి పథంలో రావాలంటే బహుజనుల రాజ్యాధికారమే ఏకైక పరిష్కార మార్గం. అంబేద్కర్, పూలే, కాన్షీరామ్ ఆలోచనలతో మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారానికి రావడం కోసం బహుజన ప్రజలంతా చైతన్యవంతం గా కావాలని బాబా సాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి సందర్భంగా సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూప్ కోరుతుంది.
