చిన్నధర్మారం గ్రామంలో
అంబలి పంపిణీ కేంద్రం
ప్రారంభం.
Scv NewbKasipeta :--
కాసిపేట మండలం చిన్నధర్మారం గ్రామంలో పెంచాలా సత్తయ్య జ్ఞాపకార్థం అతని భార్య రాజేశ్వరి అంబలి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శనివారం అంబలి పంపిణీ కేంద్రాన్ని మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా విక్రంరావు మాట్లాడు పెంచాల సత్తయ్య ఙాపకార్దం వారి భార్య రాజేశ్వరి కొడుకు రంజిత్ అంబలి పంపిణీ కెంద్రం పెట్టడం చాల అభినందనీయం అని అన్నారు. బాట సారులు ఉపాది హామీ కూలీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న ధర్మారం, ముత్యం పల్లి పంచాయితీల ఉప సర్పంచులు పానగంటి అశోక్,బోయిని తిరుపతి, తెరాస కార్యదర్శి మోటురి వేణు,వార్డ్ మెంబరు షారుక్,టిఆర్ ఎస్ పార్టీ గ్రామ కమిటి అధ్యక్షులు మెర్గు శ్రీనివాస్,పెంచాల రంజిత్,గోనె సత్యనారాయణ,సూరమ్ తిరుపతి, ఖలిమ్ పాషా,శైనా, రాంమూర్తి, తుమ్మ తిరుపతి,కయుబ్ షైక్,కోలా సచిన్,తదితరులు పాల్గొన్నారు.
