ముఖ్యమంత్రి అసెంబ్లీలో
ఇచ్చిన హామీలు
నెరవేర్చాలని వీఆర్ఏ ల రిలే
నిరాహార దీక్షలు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన హామీలు అమలు పరచాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కాసిపేట మండలం తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జీవో ను వెంటనే విడుదల చేయాలని అసెంబ్లీ లో నూతన రెవెన్యూ చట్టం చేస్తున్న సందర్భంగా 2020 సెప్టెంబర్ 9న వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని కెసిఆర్ ప్రకటించారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా జీవోను విడుదల చేయడం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పే స్కేలు పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏలు 24వేల మంది ఉన్నామని ప్రభుత్వ రెవెన్యూ,సంక్షేమ పథకాల అమలులో తమదే క్రియాశీల పాత్ర ఉందని వీఆర్ఏ లు అన్నారు తమంతా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందిన వారమేనని చాలి చాలని జీతాలతో తమ కుటుంబాలను వెల్ల తీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని వి ఆర్ వో లు తెలిపారు. మండల తహశీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలో మండలంలోని విఆర్వోలు అంతా పాల్గొన్నారు.