తమ హక్కులు నెరవేర్చాలని తహసిల్దార్ కు విశ్వబ్రాహ్మణులు వినతి.
Scv News Kasipet :-
విశ్వబ్రాహ్మణులకు జీవన ఉపాధి కష్టంగా ఉన్నందున ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కాసిపేట మండలం తాసిల్దార్ కు మండల విశ్వబ్రాహ్మణ సంగం పలు డిమాండ్లతో వినతి పత్రం ఇచ్చింది.
విశ్వ బ్రాహ్మణులను విశ్వకర్మ లను ఆదుకునేందుకు ప్రభుత్వం రెండు వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, స్వర్ణకార వడ్రంగి ఒత్తులు చేసే వారికి పనులు లేక వలస కార్మికులు గా మారారని వారిని ఆదుకోవాలని కోరారు. మండల కేంద్రాలలో 10 గుంటలు స్థలం విశ్వకర్మ భవనాలకు ఇవ్వాలని, వృత్తులను ఆధునీకరణ కోసం శిక్షణ ఇవ్వాలని, విశ్వ బ్రాహ్మణులను దేవాలయాలలో పురోహితులుగా నియమించాలని కోరారు. కల్లుగీత కార్మికులకు ఇచ్చిన విధంగా పెన్షన్ ను విశ్వ బ్రాహ్మణులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో కమిటీ అధ్యక్షుడు జంబో జి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజేందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి లో శిలోజు మురళి జిల్లా నాయకుడు కమాన్ సత్యనారాయణ, గ్రామ అధ్యక్షుడు కమాన్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.