మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

విద్యార్థులు భయాన్ని వీడి ధైర్యంగా చదివి విజయం సాధించాలి.

 విద్యార్థులు భయం వీడి లక్ష్యంపై దృష్టి

పెడితే  విజయం మీదే. 

- ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దినేని

అర్జున్



Scv News Kasipet :--

 విద్యార్థులు భయం వీడి ధైర్యంగా చదివి లక్ష్యం పై దృష్టి పెడితే  పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారని ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దినేని అర్జున్ అన్నారు. గురువారం కాసిపేట మండలం మలకపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 'పరీక్షలపై అవగాహన' కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  విద్య  నేర్చుకోవడం వల్లనే సమాజంలో గౌరవం లభిస్తుందని విద్యార్థులు నిరంతరం చదువుకుంటూనే ఉండాలని అన్నారు. ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుందని లక్ష్యం పెట్టుకుని జీవించేవారు లీడర్ అవుతారని, లక్ష్యం లేకుండా తిరిగే వారు లేబర్ గా మిగులుతారని విద్యార్థులకు తెలిపారు. లక్ష్యం పెట్టుకొని విజయం సాధించిన బీహార్ కు చెందిన దశరథ్ మాంజీ  22  సంవత్సరాలు కొండను చీల్చి  గ్రామానికి రహదారి వేసిన అతడి సాహసం గురించి విద్యార్థులకు వివరించారు.  ప్రమాదంలో కాలు కోల్పోయినా ఆధైర్యం  పడకుండా ప్రపంచానికి తన గురించి తెలపాలని  ఎవరెస్ట్ శిఖరం ఎక్కి విజయం సాధించిన  జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి అరుణిమాసిన్హా  ధైర్య సాహసాలు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు విజయం సాధించాలంటే మహనీయుల జీవిత చరిత్రలు చదవాలని తెలిపారు. లక్ష్యం పెట్టుకొని చదివిన విషయాలను విజువలైజ్ చేసు కొంటె  ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయని తెలిపారు. విజువలైజ్ ఎలా చేసుకోవాలో విద్యార్థులకు వివరించారు.

సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు మనసు పై దృష్టి సారించాలని మనిషి ఉన్నతికి పతనానికి  మనసే  కారణం కాబట్టి దాని పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రపంచంలో  రెండు రకాల మనుషులు ఉంటారు.  మనుసును ఆధీనంలో పెట్టుకున్నవారు మహానుభావులు గా .  మనసు తన అధీనంలో లేని వారు మామూలు మనుషులుగా మిగిలిపోతారని అన్నారు. విద్యార్థులు ఎప్పుడు కూడా   మనసు తన ఆధీనంలో ఉండేలా ఎరుకతో ఉండాలని అన్నారు. అప్పుడే  జీవితంలో విజయవంతంగా ఉంటారని  సూచించారు.

సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతు  విద్యార్థులు మోటివేటర్ మద్దినేని అర్జున్ చెప్పిన విషయాలను గుర్తు పెట్టుకుంటే తప్పకుండా పరీక్షల్లో విజయం సాధిస్తారన్నారు. నిరుపేద కుటుంబాల నుండి వచ్చి గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో ఉండి చదివే మీరంతా మహనీయులైన అంబేద్కర్,పూలే జీవిత చరిత్రలను చదవాలని కోరారు.

సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ మండలంలో  విద్యార్థులను, యువకులను చైతన్యపరిచి మంచి మార్గంలో తీసుకువచ్చేందుకు సామాజిక చైతన్య వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సామాజిక చైతన్య వేదిక గ్రామాలలో చేపట్టిన కార్యక్రమాల వల్ల ప్రజలు చైతన్యవంతమవు తున్నారని అన్నారు. స్వార్ధంగా నిజాయితీగా ప్రజలను సేవ చేయడమే తమ లక్ష్యమని అన్నారు.

ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు వేములవాడ రమేష్ మాట్లాడుతూ పరీక్షలకు ముందు  విద్యార్థులకు మోటివేటర్ అర్జున్ చే  మంచి  అవగాహన కల్పించాడని అన్నారు. అర్జున్  ద్వారా తాము కూడా ఎన్నో విషయాలు తెలుసు కున్నామని అన్నారు. విద్యార్థులకు మంచి 

 అవగాహన  కల్పించినందుకు సామాజిక చైతన్య వేదిక కు   కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు చంద్రమౌళి,బద్ది శ్రీనివాస్, లఖన్ సింగ్, శంకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు