ఆత్మవిశ్వాసంతో చదివితే
విద్యార్థులు పరీక్షల్లో
విజయం సాధిస్తారు
- ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్
మద్దినేని అర్జున్.
Scv News Kasipet :-
విద్యార్థులు పరీక్షల సమయంలో మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం సాధిస్తారని ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దినేని అర్జున్ విద్యార్థులకు తెలిపారు. శనివారం కాసిపేట మండలం దేవాపూర్ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఎలా సంసిద్ధత కావాలనే అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్య నేర్చుకోవడం వల్లనే సమాజంలో గౌరవం లభిస్తుందని విద్యార్థులు నిరంతరం చదువుకుంటూనే ఉండాలని అన్నారు. ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుందని లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా చదువుతే తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు. లక్ష్యం పెట్టుకుని జీవించేవారు లీడర్ అవుతారని, లక్ష్యం లేకుండా తిరిగే వారు లేబర్ గా మిగులుతారని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు 6 R మెథడ్ ప్రకారం చదువుతే అధిక మార్కులు వస్తాయని అన్నారు. వీటితో పాటు విద్యార్థులు పరీక్షల సమయంలో 4c లు సెల్ ఫోన్, సినిమా, కేబుల్ టీవీ, చాటింగ్ లకు దూరంగా ఉండాలన్నారు. పరీక్షల కు ముందు ఎలా చదవాలి, ఎలా పరీక్షలు రాయాలి, ఎలా సంసిద్ధత కావాలనే విషయాలపై పలు టెక్నిక్ లను విద్యార్థులకు వివరించారు.
సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే మనస్సును తన ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. మనిషి ఉన్నతికి, పతనానికి ప్రధాన కారణం మనసే కారణమని అన్నారు. మనసు మన స్వాధీనంలో ఉండాలంటే ధ్యానం చేయడమే ఏకైక మార్గమని, విద్యార్థులంతా ప్రతిరోజూ ధ్యానం చేయాలని కోరారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ విద్యార్థులు సమయం వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకొని చదివితే తప్పకుండా విజయం సాధిస్తార న్నారు. పేద కుటుంబాల నుండి వచ్చిన మనం ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. మోటివేటర్ అర్జున్ చెప్పిన విషయాలన్నీ విద్యార్థులు పాటిస్తే తప్పకుండా పరీక్షలో పాస్ అవుతారని అన్నారు. సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ అర్జున్ మూడు సంవత్సరాలు కష్టపడి చదివి శిక్షణ పొంది మీకు విద్యాబోధనలో మెలికలు నేర్పుతున్నాడు అని అన్నారు. మీరు కూడా అర్జున్ వల్లే కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని కోరారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలంటే ధ్యానం చేయాలని కోరారు. ధ్యానం వల్ల మానసిక శక్తి, జ్ఞాపకశక్తి పెరిగి టీచర్లు చెప్పిన విషయాలు మరచి పోకుండా ఉంటాయని అన్నారు.
ఆదివాసి నాయకుడు రాందాస్ మాట్లాడుతూ అర్జున్ చెప్పిన ప్రతి విషయాన్ని విద్యార్థులు తప్పకుండా పాటించాలని లక్ష్యం పెట్టుకొని చదివితే తప్పకుండా విజయం సాధిస్తారని అన్నారు. సామాజిక చైతన్య వేదిక సభ్యుడు మోహన్ మాట్లాడుతూ విద్యార్థి దశలో తలదించుకుని పుస్తకాలు చదివితే జీవితకాలమంతా తల ఎత్తుకొని బతకవచ్చని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉదయం సాయంత్రం ధ్యానం చేసి ఏకాగ్రతతో చదివితే అమ్మ ఫలితాలు సాధిస్తారు అని అన్నారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయు రాలు రాజేశ్వరి మాట్లాడుతూ మోటివేటర్ స్పీకర్ అర్జున్ చెప్పిన విషయాలు విద్యార్థులకు మంచి అవగాహన కలిగించాయని అన్నారు. మరిన్ని క్లాసులు ఏర్పాటు చేసి విద్యార్థులను చైతన్యవంతం చేయాలని సామాజిక చైతన్య వేదిక ను కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మా,గంగాదేవి మంగ, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.