మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పోగుల శ్రీనివాస్ కుటుంబానికి అంబేద్కర్ సంఘం చేయూత

 నిరుపేద దళిత కుటుంబానికి అంబేద్కర్ సంఘం చేయూత.




Scv News Kasipet :--

కాసిపేట్ మండలంలోని రొట్టెపెల్లి ఎస్సీ కాలనీకి చెందిన నిరుపేద పోగుల శ్రీనివాస్  ఆటో నడుపుతూ తన  కుటుంబాన్ని పోషించుకుంటూన్నాడు. అతని కుటుంబానికి ఆసరాగా ఉన్న ఆటో  ప్రమాదవశాత్తు బోల్తా పడి తీవ్రంగా గాయపడ్డారు. పది రోజుల వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు.  అతన్ని కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు అప్పులు చేసి సుమారు 5 లక్షలు ఖర్చు చేశారు. అయినా అతని ప్రాణాలు కాపాడలేక పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు దిక్కులేని వారయ్యారు. ఈ విషయం తెలిసి  బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  ఇటీవల అతని  కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేశాడు. పోగుల శ్రీనివాస్  అంబేద్కర్ యువజన సంఘము  (రొట్టెపల్లి) గ్రామ సభ్యుడు కావడంతో మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు జాడి రామచందర్ ఆధ్వర్యంలో సంఘ సభ్యుల వద్ద  విరాళాలు సేకరించారు. ఆదివారం మండల అంబేద్కర్ యువజన సంఘము నాయకులు రొట్టెపల్లి  గ్రామానికి వెళ్లి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ  ఆర్థిక సహాయంగా  8000/- రూపాయలు అందజేశారు. పోగుల శ్రీనివాస్ కుటుంబానికి అంబేద్కర్ సంఘాలు అండగా ఉంటామని ప్రభుత్వపరంగా  ఏమైనా సహాయం వచ్చేది ఉంటే ఇప్పిస్తామని జాడి రామచందర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘము  ప్రధాన కార్యదర్శి  వడ్లూరి మల్లేష్ ఉపాధ్యక్షులు గడ్డం పురుషోత్తం,  రామిళ్ళ కిష్టయ్య, జంజిరాల తిరుపతి,  సాంస్కృతిక విభాగం ఇంచార్జ్  గొడిసెలు బాపు, ముఖ్య సలహాదారులు  పల్లె మల్లయ్య, మల్కపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు పడిగల భూమయ్య దేవాపూర్ అంబేద్కర్ సంఘం నాయకులు  కాంపెల్లి వెంకటేష్, గొడిసెల సత్తి,బాపు తదితరులు పాల్గొన్నారు...