దేవాపూర్,మద్దిమాడ
స్మశాన వాటికలకు బోర్ వెల్
పనులు ప్రారంభం.
Scv News Kasipet :--
కాసిపేట మండలం లోని దేవాపూర్, మద్దిమాడ పంచాయతీ లోని స్మశాన వాటిక లకు మండల పరిషత్ నిధుల నుండి 1.80 లక్షలు మంజూరయ్యాయి. సల్ఫలవాగు ఒడ్డున నిర్మించిన స్మశాన వాటికల వద్ద గురువారం బోర్ వెల్ పనులను ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పిటిసి పల్లె చంద్రయ్య ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మద్దిమడ సర్పంచ్ ఆడే జంగూ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు రమణా రెడ్డి, పెద్దన పల్లి ఎంపీటీసీ రాంచందర్, దేవాపూర్ పార్టీ అధ్యక్షుడు వడ్లూరి మల్లేశ్, ఓరియంట్ గుర్తింపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతి రెడ్డి, తెరాస నాయకులు అనంత రావు, పురుషోత్తం ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాసుదేవ్, కైలాష్, భీమయ్య,శంకర్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.