మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దుబ్బగూడెం గ్రామంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి

 దుబ్బ గూడెం గ్రామంలో

సావిత్రిబాయి పూలే వర్ధంతి.


Scv News kasipet :-

 భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం కాసిపేట మండలం దుబ్బ గూడెం గ్రామంలో తెలంగాణ జన సమితి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎస్ జిల్లా నాయకులు గోనెల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. మహిళలకు చదువు నేర్పేందుకు పాఠశాలలు తెరిస్తే అప్పటి మనువాదులు  ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని , పేడ  నీళ్లు చల్లారని అన్నారు. ఇబ్బందులు ఎదుర్కొన్న భర్త జ్యోతిరావు పూలే అండదండలతో కోసం పాఠశాల నడిపించిన మహనీయురాలని కొనియాడారు. వర్ధంతి సందర్భంగా పని చేసిన సేవలను గుర్తు చేసుకోవడం మన ధర్మం అని అన్నారు. ఈ కార్యక్రమంలో  దుబ్బగూడెం వార్డు సభ్యురాలు గోనెల శ్రీలత, మండల  వికలాంగుల సంఘం అధ్యక్షుడు బోగే పోశం, దుర్గం శ్రీనివాస్, దుర్గం సంజీవ్, రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.

,