మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సత్యము ధర్మము, దైవము పాటించాలి

 ప్రతి ఒక్కరూ సత్యము, ధర్మము, పాటించాలని అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.

- పులాజి బాబా సంస్థాన్ మహారాజ్ వెడమ జయంత్ మహారాజ్.






Scv News Kasipet :-

సమాజంలో ప్రతి ఒక్కరూ సత్య వాక్కులు మాట్లాడుతూ ,ధర్మము పాటిస్తూ దైవాలను పూజిస్తే  ఆనందంగా జీవిస్తారని పులాజి బాబా సంస్థాన్ మహారాజ్ వెడ్మా జయంత్ మహారాజ్ అన్నారు. సోమవారం కాసిపేట మండలం దేవాపూర్ పంచాయతీ పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన సత్సంగ్ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సత్సంగ్  కార్యక్రమంలో సత్యము,ధర్మము, దైవము అంశాల మీద చర్చాగోష్టి జరిగింది. జయంతి మహారాజ్ మాట్లాడుతూ సత్యము ధర్మము దైవము పాటిస్తున్న కుటుంబాలు అన్ని  ఆనందంగా జీవిస్తారని అందరూ  పాటించాలని కోరారు. సత్యము, ధర్మము, దైవము పాటించక పోవడం వల్లనే  నైతిక విలువలు పతనమై సమాజంలో అనర్ధాలు జరుగుతున్నాయని అన్నారు. సత్సంగ కార్యక్రమాల వల్ల దైవ భావన సత్యం, ధర్మం పాటించి  ప్రజలు సన్మార్గంలో  పయనిస్తారని అన్నారు. నిత్యజీవితంలో మనుషులు ధర్మబద్ధంగా జీవించడం నేర్చుకోవాలని అన్నారు. ధర్మాలు పాటించడం వల్ల జీవితం సుఖ సంతోషాల మధ్య సాగుతుందని అన్నారు.  సృష్టి లోని ప్రతి జీవి ధర్మబద్ధంగానే జీవిస్తున్నాయన్నారు. అతి చిన్న జీవి అయిన చీమ ఎంతో క్రమశిక్షణగా అనగా వరసలు కట్టుకొని ఆహారం కోసం వెళుతూ ఉంటాయన్నారు.  ధర్మాన్ని మరచి అధర్మబద్ధం మనుషులు జీవించడం వల్లనే అనర్ధాలు జరుగుతున్నాయన్నారు. నేటి యువతీ యువకుల్లో సత్యము ధర్మము భక్తిభావం లేకుండా విదేశీ సంస్కృతులకు  అలవాటు పడ్డారని అన్నారు. తల్లిదండ్రులు గురువుల మాటలు కూడా పెడచెవిన పెట్టి ప్రమాదాల బారినపడి జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. జీవితంలో అత్యున్నతంగా జీవించాలంటే ప్రతి ఒక్కరు మానసిక పరివర్తన కోసం ధ్యానం చేయాలని సూచించారు. ధ్యానం వల్ల మనలో ఎంతో మార్పు వస్తుందని మన ఆలోచనలు మార్పు చెంది మన జీవితాలు బాగుపడతాయని అన్నారు. పరమహంస పులాజి బాబా ఇవే విషయాలను బోధించారని  బాబా మాటలను ఆచరించి జీవితాలను బాగుపరచుకోవాలని కోరారు. మహారాజ్ అన్నమయ్య మాట్లాడుతూ సత్సంగాలు జరపడం వల్ల హాజరైన భక్తులకు భక్తిభావం పెరుగుతుందని ఉన్నారు. ప్రతి ఒక్కరు సత్యము మాట్లాడుతూ  ధర్మబద్దంగా జీవిస్తూ దైవ భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు.

 సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ మన ఆలోచనలే మన జీవితం అని,మన ఆలోచనలు మారితేనే మన జీవితాలు మారుతాయి అని అన్నారు. నేటి సమాజంలో  మన జీవితాలు సాఫీగా నడవడానికి ముఖ్యమైనవి మాటలు, ఆలోచనలే నని వాటిని మార్చుకుంటే జీవితం ఆనందంగా ఉంటుందన్నారు. దేవాపూర్ వాసి గణేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సత్యము ధర్మము దైవాన్ని ఆచరించాలని అన్నారు. సత్సంగ కార్యక్రమాల వల్ల ప్రజల్లో దైవ భావన పెరిగి సక్రమమైన మార్గంలో పయనిస్తూరని అన్నారు. కొండాపూర్ వాసి ఎంబడి కిషన్ మాట్లాడుతు  సత్సంగాలు వల్ల ప్రజల్లో దైవ భావన పెరిగి సరైన బాటలో పయనిస్తారు అని అన్నారు.  ఈ కార్యక్రమంలో వెడమ కృష్ణ పటేల్, శ్రీరామ్ దాము, ఘట్ రావు పల్లె సర్పంచ్ పేద్రం రాజు , మద్దిమడ సర్పంచ్ ఆడే జంగ్, మల్కపల్లి, సోనాపూర్ సర్పంచులు, మాజీ ఎంపీపీ సిడం జంగు,  సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల  బాపు, సిడం రాందాస్, గణపతి, పెంద్రం హనుమంతు, ఎడమ కిషన్, సోయం జంగు,  పింటూ, తిరుపతి  తదితరులు పాల్గొన్నారు. సత్సంగ కార్య క్రమంలో  ఏర్పాట్లు అన్ని ఇప్పల గూడెం పులాజిబాబా  ధ్యాన మందిరం భక్తులు  చేశారు.