మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

రేగుల గూడెం గిరిజన బాలుర పాఠశాల లో b

 ఆత్మవిశ్వాసంతో చదివితే

విద్యార్థులు పరీక్షల్లో 

విజయం సాధిస్తారు 

- ఇంపాక్ట్ మోటివేటర్

 స్పీకర్ 

మద్దినేని అర్జున్






Scv News Kasipet :- 

విద్యార్థులు పరీక్షల సమయంలో మనల్ని మనం ప్రోత్సహించు కుంటూ ఆత్మవిశ్వాసంతో  చదివితే విజయం  సాధిస్తారని ఇంపాక్ట్  మోటివేటర్ స్పీకర్ మద్దినేని అర్జున్ విద్యార్థులకు తెలిపారు. గురువారం  కాసిపేట మండలం రేగుల గూడెం గిరిజన బాలురు ఉన్నత పాఠశాలలో   పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఎలా సంసిద్ధత కావాలనే అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్య  నేర్చుకోవడం వల్లనే సమాజంలో గౌరవం లభిస్తుందని విద్యార్థులు నిరంతరం చదువుకుంటూనే ఉండాలని అన్నారు. ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుందని లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా చదువుతే  తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు. లక్ష్యం పెట్టుకుని జీవించేవారు లీడర్ అవుతారని, అక్షరం లేకుండా తిరిగే వారు లేబర్ గా మిగులుతారని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ ఉపాధ్యాయులు  మాంతయ్య, భోగ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.