కాసిపేట మండల ప్రెస్ క్లబ్
నూతన కమిటీ ఎంపిక.
Scv News Kasipet :--
కాసిపేట మండలంలోని వివిధ పత్రికలలో పనిచేసే పాత్రికేయులు మంగళవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సమావేశమై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా కూకట్ల రాజేష్ (సాక్షి), ప్రధాన కార్యదర్శిగా వేల్పుల అనిల్ కుమార్, కోశాధికారిగా సయ్యద్ నజీర్ (సిటీ కేబుల్ ) ఎన్నుకున్నారు. ఎన్నికల నిర్వాహకులుగా శెట్టి శ్రీధర్ వ్యవహరించారు. ఎన్నికల అనంతరం నూతన కమిటీ సభ్యులను తోటి పాత్రికేయులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రవిరాజ్, లింగస్వామి, తిరుపతి,రమేష్, దినేష్,సురేష్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
* కాసిపేట నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గా ఏకగ్రీవంగా ఎన్నికైన కూకట్ల రాజేష్, ప్రధాన కార్యదర్శి వేల్పుల అనిల్ కుమార్, కోశాధికారి సయ్యద్ నజీర్ గారికి సామాజిక చైతన్య వేదిక డిజిటల్, సోషల్ మీడియా శుభాకాంక్షలు. 💐💐💐