పెద్దనపల్లి పంచాయతీలోని
'న్యూ కాలనీ'లో ఘనంగా
పోచమ్మ బోనాల జాతర.
Scv News Kasipet :--
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం 'న్యూ కాలనీ 'లో గ్రామస్తులు ఉగాది బోనాల జాతర ఘనంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో మూడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ పోచమ్మ కు ఘనంగా పోతరాజు వేషాధా రణ,డప్పులతో గ్రామంలోని చిన్న పెద్ద అందరు మహిళలు పోచమ్మ తల్లి కీ బోనంతో నైవేద్యం పెట్టి తల్లి ఆశీస్సులు తీసుకున్నారు, గ్రామం అంత కలిసికట్టుగా ఎలాంటి కీడు లేకుండా ప్రజలందరినీ చల్లగా చూడు తల్లి అని వేడుకున్నారు ఈ ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

