మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మల్లు స్వరాజ్యం కు సామాజిక చైతన్య వేదిక జోహార్లు

 తెలంగాణ సాయుధ పోరాట

యోధురాలు మల్లు

స్వరాజ్యం కు సామాజిక

చైతన్య వేదిక జోహార్లు.



Scv News Kasipet :--

 తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం నవాబును మట్టికరి పెంచేందుకు కమ్యూనిస్టు గెరిల్లా గా తుపాకీ చేత పట్టి విరోచితంగా పోరాడిన వీర మహిళ మల్లు స్వరాజ్యం. పదమూడేళ్ల వయసులోనే సాయుధ పోరాటంలో పాల్గొని రజాకార్ల పాలిట సింహస్వప్నం గా నిలిచారు. సాయుధ పోరాటం అనంతరం కమ్యూనిస్టు  ఉద్యమాలలో పాల్గొని ప్రజల సమస్యలపై గళమెత్తిన వీరనారి మల్లు స్వరాజ్యం. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పార్లమెంటు అసెంబ్లీ లో అడుగు పెట్టి ప్రజా సమస్యల పై ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రజా నాయకురాలు మల్లు స్వరాజ్యం. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని,తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత  ప్రజలకు న్యాయం జరగడం లేదని తెరాస ప్రభుత్వానికి కూడా తీవ్రంగా విమర్శించిన కమ్యూనిస్టు యోధురాలు మల్లు స్వరాజ్యం. మల్లు స్వరాజ్యం మృతి తెలంగాణ పీడిత ప్రజానీకానికి తీరని లోటు. వీరనారి కి సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా తరుపున  విప్లవ జోహార్లు.