మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అంబేద్కర్ సంఘం అన్ని వర్గాలది, ఆదరించండి

అంబేద్కర్ సంఘం అన్ని

వర్గాల వారిదాని, అందరూ 

ఆదరించాలి!

- జాడి రామచందర్ 

అంబేడ్కర్ యువజన

 సంఘం మండ శాఖ

అధ్యక్షులు.



Scv News Kasipet:-


అంబేద్కర్ యువజన సంఘం అన్ని కులాల వారిదని, మండల ప్రజలు ఆదరించి కమిటీల ఏర్పాటుకు సహకరించాలని అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు జాడి రామచందర్ కోరారు. ఆదివారం కాసిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో కాసిపేట గ్రామ కమిటీ ఎన్నికకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.అంబేద్కర్ కేవలం ఎస్సీలకు పరిమితం అయ్యాడనే అపోహలు తొలగించుకు నేందుకు మండల శాఖ  నూతన పద్ధతిలో అన్ని వర్గాలను కలుపుకుని కమిటీలను ఏర్పాటు చేయడం జరుగు తుందన్నారు.బహుజన వర్గాలలోని కులాల ఐక్యతకు రాష్ట్రంలోని అంబేద్కర్ ఉద్యమానికి ఆదర్శంగా నిలుస్తుంద న్నారు.కాసిపేట గ్రామ కమిటి బీసీ,యాదవ వర్గానికి చెందిన దాడి పెంటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. కోమటిచేను ఎస్సీ వర్గానికి చెందిన ఆడే శంకర్ ను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. మండలంలోని మిగతా ప్రాంతాలలో కూడా అంబేద్కర్ కమిటీలను అన్ని వర్గాలను కలుపుకుని వేసేందుకు అందరూ సహకరించాలని కోరారు.


ముఖ్య సలహాదారు అంబేద్కర్ వాది మండల కేంద్రంలో మొట్టమొదట అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పిన బన్న  ఆశాలు మాట్లాడుతూ మండలంలోని బహుజనుల మంత ఐకమత్యంతో ఉండాలని ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని అన్నారు. మండల కేంద్రంలో 1987లో మొట్టమొదట విగ్రహాన్ని నెలకొల్పానని అన్నారు.విగ్రహం  ఆకారం సరిగా లేకపోవడంతో తొలగించడం జరిగిందని అన్నారు. కొత్త విగ్రహంపెడతా మన్న రాజకీయ నాయకులు మాట తప్పడంతో సిపిఐ నాయకుడు జాడి పోశం ముందుకు వచ్చి ఇప్పుడున్న విగ్రహాన్ని కొనివ్వడం జరిగిందని అన్నారు. అంబేద్కర్ సంఘాల్లో మహిళా కమిటీలను కూడా వేయాలని సూచించారు.


ముఖ్య సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘం విస్తరణలో అన్ని వర్గాలు కలిసి రావాలని కోరారు.అంబేద్కర్ సంఘాల్లో విభేదాలకు తావు లేకుండా ముందుకు వెళ్లాలని, రాజకీయ పార్టీల వివాదాలు, కుటుంబ తగాదాలు చొరబడ నివవద్దని కోరారు. మనలో విభేదాలు సృష్టించి దాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మనువాదు లు ప్రయత్నాలు చేస్తారని దీన్ని అంబేద్కర్ వాదులు గమనించా లన్నారు. తరతరాలుగా ఈ దేశంలో 90% పైగా ఉన్న  బహుజ న కులాల మధ్య ఐక్యత లేకుండా మన మధ్యలో చిచ్చు పెట్టి  మనువాదం బ్రతుకుతుందన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా బహు జనులు అంత ఐక్యమత్యంతో ఉండాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని అంబేద్కర్ పూలే ఆలోచనా విధానంతో బహుజన ఉద్యమాన్ని మండలం లో ఉద్ధృతం చేయాలని పిలుపు నిచ్చారు. 


ఎన్నికల నిర్వాహకులు సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిసెల బాపు మాట్లాడుతూ అంబేద్కర్ వాదుల మంతా కలుసుకున్నప్పుడు ఇక నుంచి' నమస్తే 'కు బదులు 'జై భీమ్' అనుకోవాలని సూచించారు. నమస్తే అంటే బ్రాహ్మణీయ మనువాద భాషలో తెలివిలేని వారని అర్థమని, జై భీమ్ అంటే జయం వర్ధిల్లాలని అన్నారు. బహుజన సోదరుల మంత ఇక నుండి 'జై భీమ్' పలకరించు కోవాలని  సూచించారు. మండలంలో అంబేద్కర్ వాదం మండల నూతన కమిటీ ఎంపికైన నుండి కార్యక్రమాలు ఉధృతం అయ్యాయని అన్నారు. మండల కేంద్రంలో వర్ధంతి కార్యక్రమంతో పాటు అన్ని  కులాలను కలుపుకొని గ్రామ కమిటీల ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు.ఇన్నాళ్లు  రాజ్యాధికారానికి దూరం గా ఉన్న బహుజన వర్గాలు అంతా ఐకమ త్యంతో రాజాధికారం సాధించే దిశలో వెళ్లాలని కోరారు.

ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని దేవాపూర్ లో పెద్ద ఎత్తున జరిపేందుకు గ్రామ కమిటీ నిర్ణయం తీసుకుందని మండల శాఖ దానికి సహకరించాలని కోరారు.

మండల అంబేద్కర్ సంఘం నాయకుడు అగ్గి స్వామి మాట్లాడుతూ  మండల కేంద్రంలో  బుద్ధుడి విగ్రహం తన సొంత  ఖర్చులతో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అంబేద్కర్ యువజన సంఘం తనకు సహకరించాలని కోరారు.

పంచాయతీ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన దాడి పెంటయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎన్నిక చేసినందుకు మండల కమిటీకి కృతజ్ఞత తెలుపుతూన్న నన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని విస్తరించేందుకు శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. అనంతరం జాడి రామచందర్ ఆధ్వర్యంలో మండల కమిటీ నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షులు దాడి పెంటయ్యను శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో మండల శాఖ ఉపాధ్యక్షుడు ఆగ్గి సత్తయ్య, సంయుక్త కార్యదర్శి అక్కపెళ్లి  బుగ్గ రాజు, గొడిసెల సురేందర్, దాగం రాజలింగు దేవాపూర్ గ్రామ కమిటీ కార్యదర్శి కాంపెళ్లి  వెంకటేష్ తదితరులు  పాల్గొన్నారు.