' పునాది లేని ఇల్లు,చరిత్ర తెలియని జాతి రెండు ఒకటే . పునాది లేకుంటే ఇల్లు నిలబడదు, చరిత్ర తెలియకుంటే జాతి బాగుపడదు.చరిత్ర తెలియని వాడు చరిత్రను నిర్మించలేడు' అన్న మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని మండలంలో బహుజన ఉద్యమకారులు, పోరాట యోధుల నిజమైన జీవిత చరిత్రలను నేటి తరానికి తెలియ చేసేందుకు' scv News' ముందుకు వచ్చింది. భారతదేశ చరిత్రలో ఆదిపత్య కులాలైన మనువాదుల కుట్రల వల్ల అగ్రవర్ణాల చరిత్ర తప్ప దేశంలోని 95 శాతం ఉన్న మెజార్టీ వర్గాలైన బహు జనుల అసలైన చరిత్ర లిఖించబడ లేదు.పూలే,అంబేద్కర్ ఆలోచన ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి మన అసలైన బహుజన ఉద్యమకారుల చరిత్రలను తెలుసుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పుణ్యాన నేడు బహుజనులకు చదువుకునే,స్వేచ్ఛగా మాట్లాడుకునే, ఉద్యోగాలు చేసే హక్కులు, రాజకీయ పదవులు పొందే హక్కులు కల్పించ బడ్డాయి.వాటి తోటే మనం నేటి సమాజంలో గౌరవంగా బతుకు తున్నాం.లేకుంటే మన తాత,ముత్తాతలు, తండ్రుల వలె,అగ్రకుల పెత్తందార్లు,వెలమ దొరల కాళ్ల కింద,వారి గడిలలో నలిగి పోయే వాళ్ళమే అన్న సత్యాన్ని బహుజన వర్గాలు ఎన్నటికీ మరిచిపోవద్దు.
కాసిపేట మండలంలో 99% బహుజను లు జీవిస్తున్నారు.ఈ మండలంలో మన గత చరిత్ర మనకు తెలిస్తేనే ఎవరు ఏంటో నేటితరానికి తెలుస్తుంది. గతంలో ఏ పత్రికలు, మీడియా బహుజన పోరాట యోధుల చరిత్రను వెలుగులోకి తేలేదు. పత్రికలు, మీడియ అంతా అగ్రకుల అహంకారంతో ఉన్న బడా పారిశ్రామిక పెట్టుబడిదారుల చేతుల్లో ఉండడం వల్ల బహుజనుల గురించి రాయలేదు. మండలంలో కూడా బహుజన ప్రజల కోసం నిస్వార్థంగా నిజాయితీగా పని చేసిన బహుజన ఉద్యమకారులు, పోరాట యోధులు ఎందరో ఉన్నారు. వీరి గురించి ఏ పత్రికా మీడియా ఇంతవరకు ప్రస్తావించ లేదు.వారి చరిత్ర ఎవరికి తెలవకుండా కాలగర్భంలో కలిసి పోయింది. మండలంలో రాజకీయ పెత్తనం చెలాయించే వర్గాల అరాచకాలను ఎదిరించి మన బహుజన ప్రజల కోసం పనిచేసి ప్రాణ త్యాగం చేసిన ఉద్యమకారులు,ప్రజా నాయకుల గురించి మన బహుజన వర్గాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 'ప్రతి అక్షరం- ప్రజల కోసం 'అనే నినాదంతో పని చేసేందుకు ముందుకు వచ్చిన సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా బహుజన ఉద్యమ కారుల గురించి పరిశోధించి వారి చరిత్రలు వెలికి తీసింది. గతంలోని బహుజన ఉద్యమకారులతో పాటు నేడు ప్రజల కోసం పని చేస్తున్న ప్రజా నాయకుల వాస్తవ చరిత్రను మండల ప్రజలకు తెలియ జేసేందుకు నడుంకట్టింది. మండలంలోని ప్రజల కోసం గ్రామాల అభివృద్ధికి, వారు చేసిన సేవలను గుర్తుచేసే విధంగా వరుసగా సంచలన కథనాలు 'scv news' ద్వారా వెలుగులోకి తీసుకురానున్నాము.
బహుజన జాతులకు మన గత చరిత్ర ఏందో మనకు తెలియదు.గతంలో మన తాత, ముత్తాతలు,తండ్రులు స్థానిక అగ్రకుల పెత్తందార్ల అరాచకాలకు, హింసలకు దౌర్జన్యాలకు ఎలా గురయ్యారో తెలుసుకోవాల్సిన బాధ్యత నేటి ఉద్యమ కారులపై ఉంది.అప్పుడే మనము సరైన మార్గంలో ఆలోచిస్తాం.మనవాళ్ళు ఎవరు,మన వ్యతిరేకులు ఎవరో తెలు స్తుంది.గత చరిత్రనుమార్చాలనుకునే మన బహుజన ఉద్యమకారులు, అంబేద్కర్ వాదులు, మండల యువతరానికి చరిత్రను అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తెలియజేస్తున్నాం.
'Scv News ' ద్వారా ఇచ్చే కథనాలు ఎవరినో అగౌరవపరిచే విధంగా,అవమా నించే రీతిలో ఇవ్వడం లేదని గుర్తించాలి. మండలంలో తరతరాలుగా బహుజన వర్గాలపై అగ్రకుల పెత్తందార్లు జరిగిన దోపిడి దౌర్జన్యాలను,వాస్తవ చరిత్రను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పూలే,అంబేద్కర్ మహనీయుల సిద్ధాంతం,వారి ఆలోచన స్ఫూర్తితో పనిచేస్తున్న 'Scv News ' మన గత చరిత్రను బహుజన సోదరులందరికీ తెలియపరిచి వారిని చైతన్య పరచాలని మా ప్రధాన లక్ష్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాధికారం సాధించడమే మన అంతిమ లక్ష్యం అన్న మాటలు నిజం చేయాలంటే మెజారిటీ వర్గమైన బహుజనుల మంతా మన గత చరిత్రను తెలుసుకొని భవిష్యత్తు ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవాల్సిన అవసరం తప్పనిసరి. మండలంలోని ఆధిపత్య కులాలకు చెందిన వెలమ,రెడ్లకు తాము వ్యతిరేకం కాదు. వారిలో కూడా బహుజన ప్రజలకు యోగక్షేమాలు తెలుసు కొని మంచి పనులు చేసినవారు కూడా చాలామంది ఉన్నారు. బహుజన వర్గాల ప్రజల కోసం పరితపించిన దొరలను, రెడ్లను మేము గౌరవిస్తాం. అధికార దర్పంతో,బహుజన వర్గాల ప్రజలపై అణచివేత,దోపిడీ, దౌర్జన్యాలు చేసిన వారిని మాత్రమే మేము వ్యతిరేకిస్తాం.వారి గురించే మేము ప్రస్తావించడం జరుగుతుందని గమనించగలరు.
* సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియాను ఆదరించాలని మండల వాసులకు మనవి .
మండలంలోని బహుజనుల కోసం పనిచేస్తున్న' Scv News ' డిజిటల్ పేపర్ ను, సామాజిక చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ను మండల ప్రజలు ఆదరించాలని మనవి . డిజిటల్ పేపర్ ను గూగుల్ లో www. Scvnews. in ద్వారా సర్చ్ చేసి ఎక్కడి నుండైనా చూడవచ్చు. వీడియోలను యూట్యూబ్ లో 'సామాజిక చైతన్య వేదిక తెలుగు' అని టైప్ చేస్తే ఛానల్ కనబడుతుంది. బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి రోజు మండలంలోని సమస్యలపై వీడియోలు పెట్టేందుకు ప్రయత్ని స్తున్నాము. ఇకనుండి ప్రత్యేక కథనాలు ఉదయం ఏడు గంటలకు , ఈరోజు జరిగే కార్యక్రమాలు సాయంత్రం వేళ 8 గంటలకు ఆ రోజే ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.మండలంలోని అంబేద్కర్ సంఘాలు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి. మీ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను, 96189 18965, 94903 54965, పంపిస్తే ఏ రోజు వార్తలు ఆ రోజు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం .
ఇట్లు
పల్లె మల్లయ్య
సామాజిక చైతన్య వేదిక డిజిటల్,
సోషల్ మీడియా సమన్వయకర్త
కాసిపేట మండలం
