మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అంబేద్కర్ యువజన సంఘం కోమటి చేను గ్రామ కమిటీ ఎంపిక

 అంబేద్కర్ యువజన

సంఘం  కోమటి చేను కమిటీ

అధ్యక్షుడిగా ఆడే శేఖర్ 

ఎంపిక.




Scv  NewsKasipet :--

 కాసిపేట మండలం కోమటి చేను  పంచాయితీలో ఆదివారం మండల  అంబేద్కర్ యువజన సంఘం  కమిటీ సమావేశం జరిగింది. మండల కమిటీ అధ్యక్షుడు జాడి రామచందర్, మండల కమిటీ సమక్షంలో  పంచాయతీ కమిటీని ఎన్నుకున్నారు.

అంబేద్కర్ యువజన సంఘం పంచాయతీ కమిటీ అధ్యక్షుడిగా ఆడే శేఖర్ (సామ గూడెం ), గౌరవ అధ్యక్షులుగా సర్పంచ్ రామటెంకి శ్రీనివాస్, ఎంపీటీసీ నవనందుల చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శిగా రామటెంకి రామ్ చందర్  (కోమటి చేను), ఉపాధ్యక్షుడుగా కురిసింగ వసంతరావు (రేగులగూడెం), దుర్గం ప్రవీణ్( కొత్త వరి పేట),గుండేటి రమేష్ (వరిపేట) కార్యనిర్వాహక అధ్యక్షులుగా రమేష్, జాడి రాజయ్య కోశాధికారిగా దుర్గాప్రసాద్, ప్రచార కార్యదర్శులుగా సాంబాడి నాగరాజు, బెడ్డల శేఖర్, ముఖ్య సలహాదారులు గా దుర్గం సూర్య ప్రకాష్ (ఉపసర్పంచ్ ) రమటెంకి రాజలింగు, కురిసిన్గ తిరుపతి, గుమ్మడి శంకర్ లను సభ్యులుగా దుర్గం ప్రశాంతి, రామటెంకి వినోద్, జాడి వినోద్, భూక్యా అశోక్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తదనంతరం ఈ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆడే శేఖర్ ను మండల శాఖ అధ్యక్షుడు జాడి రాంచందర్ ఆధ్వర్యంలో సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ  చంద్రమౌళి, మండల ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్, ప్రధాన సలహాదారు పల్లె మల్లయ్య, ఉపాధ్యక్షులు రామిళ్ళ కిష్టయ్య, జంజిరాల తిరుపతి సంయుక్త  కార్యదర్శి గొడిశాల సురేందర్, ఎన్నికల నిర్వాహకుడు సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిసెల బాపులు పల్లెగూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ శాలువాతో సన్మానించారు.


 అంబేద్కర్ భావజాలాన్ని గిరిజన

గూడా లకు విస్తరించేందుకు కృషి చేస్తా

 - అధ్యక్షుడు  ఆడే శేఖర్ 



కోమటి చేను  పంచాయతీ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన ఆడే శేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని ఆవగాహన లోపం వల్ల ఇన్నాళ్ళు ఒక ఎస్సీ లకే పరిమితం చేశారని అన్నారు. మండలంలో గిరిజన జనాభా ఎక్కువ ఉందని  గిరిజన గూడాలకు అంబేద్కర్ భావజాలం వెళ్లడంలేదని గిరిజన గూడలలో కూడా కమిటీలు వేయాలని అన్నారు. ఇకనుండి అంబేద్కర్ భావజాలం గిరిజనగూడ లలో విస్తరించడం కోసం కృషి చేస్తానని అన్నారు. గిరిజన యువతకు అంబేద్కర్ భావజాలాన్ని పరిచయం చేసి  గిరిజన గూడాలలో అంబేద్కర్ గురించి  ప్రచారం చేయడమే తన ధ్యేయంగా పెట్టుకుంటా నని అన్నారు.

 కోమటి చేను సర్పంచ్ రాంటెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ కోమటి చేను పంచాయతీ లో ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నా ఎస్టి నుండి ఆడే శేఖర్ ను ఎంపిక చేసుకున్నామని అన్నారు. పంచాయితీ లోని అన్ని గ్రామాలలో అంబేద్కర్ భావజాలం వ్యాప్తికి కృషి చేస్తామన్నారు. పంచాయతి లో అంబేద్కర్ విగ్రహం గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

మండల శాఖ అధ్యక్షుడు రాంచందర్ మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘం గిరిజన గూడ లో విస్తరించేందుకు ఆటంకాలు జరుగుతున్నాయని అన్నారు. అంబేద్కర్ సంఘాన్ని  గిరిజన గూడలలో విస్తరించేం దుకు ఆడే శేఖర్ మండల కమిటీలో తీసుకోవాలని ప్రతిపాదించారు.

సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండడం మండలాన్ని ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంగా ప్రకటించిందన్నారు. అంబేద్కర్ సంఘం లో గిరిజనుడిని  అధ్యక్షుడిగా చేయడం   శుభ పరిణామం అన్నారు. అంబేద్కర్ సంఘాన్ని గిరిజన గూడాల విస్తరించేం దుకు ఆడ శేఖర్ సహకరించాలన్నారు   గ్రామంలో అంబేద్కర్ విగ్రహం, గ్రంథాలయం ఏర్పాటు కు పంచాయతీ కమిటీ కృషిచేయాలని సూచించారు. సమావేశానికి వందన సమర్పణ ఉపసర్పంచ్ పంచాయతీ కమిటీ సలహాదారు దుర్గం సూర్య ప్రకాష్ తెలిపారు.