మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలం లో హోలీ సంబరాలు

 కాసిపేట మండలం లో హోలీ సంబరాలు.






Scv News Kasipet :--

 కాసిపేట మండలంలో వివిధ గ్రామాలలో  ప్రజలు శుక్రవారం హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. గత సంవత్సరం హోలీ సంబరాలు  కరోనా వల్ల నిర్వహించు కోలేకపోయారు. కరోనా పీడ విరగడవడంతో ఈ సంవత్సరం అన్ని గ్రామాల ప్రజలు,గిరిజన గుడాలలో హోలీ సంబరాలు ఆనందంగా జరుపుకున్నారు. హోలీ కి ముందు వారం రోజులుగా చిన్నారులు జాజిరి ఆట ఆడుతూ గ్రామాలలో తిరుగుతూ పాటలు పాడుతూ విరాళాలు సేకరించారు. హోలీ పండుగను గిరిజనులు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. మండలంలోని     సోనాపూర్, ఘట్ రావుపల్లి, వెంక టాపూర్, రొట్టె పెళ్లి  పంచాయతీల పరిధిలోని గిరిజన గూడాలలో  గురువారం రాత్రి నుండి సంప్రదాయ బద్దంగా డోల్ వాయిస్తో  నైవేద్యం  పెట్టి కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం రంగులు పూసుకుంటూ యువకులు సంబరాలు జరుపుకున్నారు. గిరిజన గ్రామాలలో యువకులు  డప్పులు వాయిద్యాలతో పాటలు పాడుకుంటూ నృత్యాలు చేస్తూ విరాళాలు సేకరించారు. సింగరేణి, ఓరియంట్ సిమెంట్ పరిశ్రమలకు   ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం తో  కాసిపేట ముత్యం పల్లి, దేవాపూర్ లలో కార్మికులంతా రంగులు పూసుకుంటూ  హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. కొండాపూర్ మల్కపల్లి, కోనూరు, కోమటి చేను  ధర్మారావుపేట్ గ్రామాలలో విద్యార్థులు, చిన్నారులు రంగుల సీసాలు పట్టుకొని చల్లుకుంటూ వీధుల్లో తిరుగుతూ హోలీ సంబరాలు చేసుకున్నారు. ధర్మారావుపేట,,కోమటి చేను, గ్రామాలలో మహిళలు కూడా జట్లు జట్లుగా ఏర్పడి హోలీ సంబరాలు చేసుకుంటూ గ్రామాలలో  విరాళాలు సేకరించారు. మండలంలోని  టిఆర్ఎస్ కాంగ్రెస్, రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా ముఖాలకు రంగులు పూసుకుని  సంబరాలు జరుపుకున్నారు.