గట్రావుపల్లె గోండుగూడా లో
సిసి రోడ్ పనులు ప్రారంభం.
Scv News Kasipet :-
కాసిపేట మండలం గట్రావుపల్లె పంచాయతీ పరిధిలోని గొండుగూడాలో ఆదివారం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద సిమెంటు రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయి. సిమెంట్ రోడ్డు పనులను మండల జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, సర్పంచ్ పెంద్రం రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం కార్య నిర్వాహక అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, స్థానిక నాయకులు అచ్యుతరావు, గణపతి,దేవాపూర్ టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ తదితరుల పాల్గొన్నారు.