మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పల్లంగూడెం సర్పంచ్ దుస్స విజయ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

మనసున్న మహా రాణి

పల్లగూడెం సర్పంచ్ దుస్స

విజయ మరో  నిరుపేద

గిరిజన కుటుంబానికి  ఆర్థిక 

సహాయం.



Scv News Kasipet :--

 పంచాయితీ  ఎన్నికల్లో ప్రజలు తమ యోగక్షేమాలు తెలుసుకొని  గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారనే విశ్వాసంతో ప్రజలు తమ గ్రామానికి చెందిన యువతీ, యువకులను  సర్పంచులుగా ఎన్నుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలా మంది సర్పంచులు ప్రజల యోగక్షేమాలు విస్మరించి ధనార్జనే ధ్యేయంగా స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తూ  సర్పంచ్ పదవిని వాడుకుంటు ప్రజల ఆదరణ కోల్పోతున్నన్నారు. పైగా సర్పంచ్ పదవిని అడ్డం  పెట్టుకొని తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను వేధింపులకు  గుర్తుచేస్తూ వారి  వద్ద ప్రతి పనికి డబ్బులు గుంజుతు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న నేటి రోజుల్లో ప్రజల  యోగక్షేమాలు తెలుసుకుని, వారి  కష్టసుఖాల్లో నేనున్నానంటూ  మనసున్న మహారాణిని గా ప్రజల ఆదరణ పొందుతున్నారు కాసిపేట మండలంలో ని పల్లంగూడెం సర్పంచ్ దుస్స విజయ చందులు .  పేద కుటుంబాలకు పెళ్లి ఖర్చుల కోసం చేసే ఆర్థిక సహాయాన్ని కొనసాగింపుగా శుక్రవారం  తమ గ్రామ పంచాయతీ పరిధిలోని గోండుగూడ గిరిజన గ్రామానికి చెందిన సెడ్మాకా  దేవేంద్ర నాగు కుమార్తె పెళ్ళికి, మంగళ సూత్రం మెట్టెలుతో పాటు కొత్త బట్టలు,పెళ్లి ఖర్చుల కోసం పదివేల రూపాయల నగదును అందజేశారు.

నిరుపేద కుటుంబం గిరిజన కుటుంబంలో పెళ్లి సహాయం కింద సర్పంచి అందజేసిన పదివేల రూపాయలు మట్టెలు మంగళసూత్రం వారి కుటుంబాల్లో ఎంతో సంతోషాన్ని నింపింది.పెళ్లి సమయంలో నిరుపేద కుటుంబాలకు మండలం లో ఏ సర్పంచ్ కూడా  చేయలేని రీతిలో  ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలలో  వెలుగులు నింపుతున్న మానవతామూర్తి మనసున్న  మహారాణి సర్పంచ్  దుస్స విజయ చందులు.తన మూడేళ్ల పదవీ కాలంలో  ఇప్పటివరకు తన గ్రామ పంచాయతీలో 11 మంది  కుటుంబాలకు లక్షా 10 వేల ఆర్థిక సహాయం తో పాటు మరో లక్ష రూపాయల విలువగల మట్టెలు, మంగళ సూత్రం, కొత్తబట్టలు  వస్తువులను అందజేశారు. పంచాయితీ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు వివాహ ఖర్చుల కోసం ఆర్థిక సహాయం  చేస్తూ మంచిర్యాల జిల్లా కే ఆదర్శంగా నిలుస్తున్నారు. 

మండలంలోని సర్పంచులు కూడా ఆదర్శంగా తీసుకొని ఆర్థిక సహాయం చేయాలి.

మండలంలో 22 పంచాయితీలు ఉన్నాయి. వీటిలో పల్లంగూడెం, పెద్దనపెళ్లి సర్పంచులు మాత్రమే  పంచాయతీ పరిధిలోని పేదలకు పెళ్లి ఖర్చు కోసం ఆర్థిక సహాయం చేస్తున్నారు. నేటి  రోజుల్లో నిరు పేదలైన బహుజనులకు పెళ్లి ఖర్చులు  భారమై పోయాయి. ఇలాంటి తరుణంలో తమకు తోచిన రీతిలో సర్పంచులు సహాయం చేయడం వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. ఇప్పటివరకు పల్లంగూడెం, పెద్దనపల్లి సర్పంచ్ లు మాత్రమే ఆర్థిక సాయం అందిస్తు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరికి సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూపు ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది. వీరిని ఆదర్శంగా తీసుకుని  మండలంలోని  మిగతా సర్పంచులు కూడా వారి పంచాయతీ పరిధిలోని  పేద కుటుంబాలకు పెళ్లి సహాయం అందించాలని'scv news ' సోషల్ మీడియా గ్రూప్ కోరుతుంది.