మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో అగ్ని ప్రమాదం ఇల్లు దగ్ధం

 దేవాపూర్ లో అగ్ని ప్రమాదం. ఇల్లు దగ్ధం.





Scv News Kasipet :-

కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీ లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో నిరుపేద గద్దల లత ఇల్లు దగ్ధమైంది. బాధితురాలి   కథనం ప్రకారం  ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు.  ప్రమాదం జరిగిన సమయంలో లత వారి ఇద్దరు పిల్లలు పక్క ఇంటి వారి వద్ద ఉన్నారు. అగ్నిప్రమాదంలో   ఇంట్లో ఉన్న 40 వేల నగదు తో పాటు ఫ్రిడ్జ్, రెండు క్వింటాళ్ల బియ్యం, నిత్యవసర వస్తువులు, 2 సెల్ ఫోన్లు  తలుపులు, ఇల్లు పై భాగం మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల  ఆస్తి నష్టం జరిగింది. ఆదివారం మండల రెవెన్యూ గిరిదావర్ సులోచన, రెవెన్యూ అధికారి ప్రేమ్ సాగర్ ఆమె ఇంటిని పరిశీలించి ఆస్తి నష్టాన్ని అంచనావేసి ఇంటి యజమానురాలు లత దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు . వారి  కుటుంబ సహాయార్థం  25 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. వారి వెంట మండల టిఆర్ఎస్ నాయకుడు అనంత రావు రెవెన్యూ సహాయకులు బొడ్డు కార్తీక్ లు ఉన్నారు.